Horoscope Today: ఈ రాశి వారు ఏ ప్రయత్నం ప్రారంభించినా సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు.. దిన ఫలాలు (ఆగస్టు 26, 2025): మేష రాశి ఉద్యోగులకు తమ అధికారుల నుంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం పెరిగేందుకు సమయం సానుకూలంగా ఉంది.
మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి:
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహం అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా, ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక నిర్ణయాలు, ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రముఖ వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం సాధ్యం. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి తగ్గవచ్చు. వృత్తి, వ్యాపారాలపై మరింత శ్రద్ధ అవసరం. ఆదాయం పెరిగేందుకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో హోదా, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొంత అనారోగ్య ఇబ్బందులు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో పిల్లల వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. బంధుమిత్రులతో మాటలు, చేతల్లో తొందరపాటు చేయవద్దు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆహారం, ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో అధికారులు మీపై ఎక్కువగా ఆధారపడతారు. పని భారం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొంత శ్రమతో లాభాలు పెరుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సుఖమయంగా సాగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో ప్రాముఖ్యత, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలపై శ్రద్ధ పెట్టాల్సిన సమయం. ఆస్తి, ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరిగేందుకు సమయం అనుకూలంగా ఉంది. సొంత పనులపై దృష్టి పెట్టండి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. ఆహారం, విహారాల్లో జాగ్రత్త అవసరం.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొంత పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయవచ్చు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. రావలసిన డబ్బు, మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఇతరులపై ఆధారపడకపోవడం మంచిది. కుటుంబ విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సఫలం అవుతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో వివాదాలు తలెత్తవచ్చు. కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. స్నేహితుల సహాయంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగ జీవితం అనుకూలంగా, సంతృప్తికరంగా సాగుతుంది. మీ సలహాలు, సూచనలు అధికారులకు లాభిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారమవుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదారులపై ఆధిపత్యం సాధిస్తారు. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడవద్దు. ముఖ్యమైన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలను అధిగమించి లాభాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ సలహాలు, సూచనలు అధికారులకు, బంధుమిత్రులకు లాభిస్తాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.