Lemon Leaves:నిమ్మ ఆకులతో ఇలా చేయండి.. ఆ సమస్యలన్నీ పరార్‌ అవుతాయి

Lemon Leaves:నిమ్మ ఆకులతో ఇలా చేయండి.. ఆ సమస్యలన్నీ పరార్‌ అవుతాయి.. నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. నిమ్మరసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని మనం వంటల్లో తరచూ ఉపయోగిస్తాం. కొందరు నిమ్మరసాన్ని నేరుగా తాగుతారు, మరికొందరు గోరువెచ్చని నీటిలో కలిపి సేవిస్తారు. 

ఆయుర్వేదం ప్రకారం, నిమ్మరసం శరీరానికి అనేక లాభాలను చేకూరుస్తుంది. పురాతన కాలం నుంచి నిమ్మకాయలను ఆహారంగా, ఔషధంగా వాడుతున్నారు. అనేక సాంప్రదాయ వైద్య విధానాల్లో కూడా నిమ్మకాయలు ఉపయోగంలో ఉన్నాయి. అయితే, నిమ్మకాయలు మాత్రమే కాదు, నిమ్మ ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. 

ఈ ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి వ్యాధులను తగ్గించి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నిమ్మ ఆకులతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

చక్కని నిద్ర కోసం...
నిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని వడకట్టి, అందులో కొద్దిగా తేనె కలిపి తాగితే అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ఒక కప్పు మోతాదులో తీసుకోవచ్చు. రోజూ తాగే టీ, కాఫీలకు బదులుగా నిమ్మ ఆకుల టీని సేవిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఈ టీలో అల్లం రసం కలిపి తాగితే మరిన్ని లాభాలు కలుగుతాయి. 

నిమ్మ ఆకుల టీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉంటుంది. మెదడు శాంతిస్థితిలోకి వస్తుంది, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. రాత్రి వేళల్లో చక్కగా నిద్ర పడుతుంది, నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ టీ నాడీమండల వ్యవస్థను శాంతపరుస్తుంది, టెన్షన్ తొలగిపోయి ప్రశాంతమైన స్థితి కలుగుతుంది. అలసట, నీరసం కూడా తగ్గిపోతాయి.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి...
నిమ్మ ఆకుల టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి పెరుగుతుంది. నిమ్మ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి.

 కణాలు ఆరోగ్యంగా ఉంటాయి, దీంతో గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ టీని రోజుకు రెండు సార్లు తాగితే సీజనల్ వ్యాధులను అడ్డుకోవచ్చు. నిమ్మ ఆకుల్లోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, దీంతో దగ్గు, జలుబు తగ్గుతాయి, జ్వరం నుంచి త్వరగా కోలుకోవచ్చు.

ఎలా ఉపయోగించాలి...
నిమ్మ ఆకులు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, వీటిని చెట్టు నుంచి తెంపిన తర్వాత శుభ్రంగా కడగాలి. లేకపోతే, ఆకులపై ఉండే కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందుల అవశేషాలు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు సేంద్రీయ పద్ధతిలో పెంచిన నిమ్మ చెట్ల ఆకులను ఉపయోగించడం మంచిది. 

కొందరికి సిట్రస్ అలర్జీ ఉంటుంది, అలాంటి వారు నిమ్మ ఆకులను వాడకూడదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు నిమ్మ ఆకులను ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. నిమ్మ ఆకులతో తయారు చేసిన నీటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే శరీరం తాజాగా మారుతుంది, చెమట వాసన తగ్గుతుంది. 

నిమ్మ ఆకులను పేస్ట్‌గా చేసి, అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, కాసేపటి తర్వాత కడిగితే ముఖం నిగారింపును సంతరించుకుంటుంది. నిమ్మ ఆకుల పేస్ట్‌లో పెరుగు కలిపి జుట్టుకు రాస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, శిరోజాలు ఒత్తుగా, దృఢంగా, కాంతివంతంగా పెరుగుతాయి. ఇలా నిమ్మ ఆకులతో ఎన్నో ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top