WhatsApp Messages AI: శాస్త్ర సాంకేతిక రంగాలు నూతన విధానాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త ఆవిష్కరణలు మానవ జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తున్నాయి.
వాట్సాప్: శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ వాట్సాప్ ఈ రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. ప్రారంభంలో కేవలం సందేశాలు మరియు ఫోటోల పంపిణీకి మాత్రమే ఉపయోగపడిన ఈ యాప్, కాలక్రమేణా అనేక మార్పులకు గురైంది. ఇప్పుడు వీడియోల నుంచి పిడిఎఫ్ ఫైల్స్ వరకు పంపే సౌలభ్యాన్ని అందిస్తోంది.
కృత్రిమ మేధ (AI) ప్రవేశంతో వాట్సాప్‌లో సమూల మార్పులు కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ సరికొత్త రూపం సంతరించుకుంది. మెటా కంపెనీ నిరంతరం కొత్త ఆవిష్కరణలను పరిచయం చేస్తూ వాట్సాప్‌ను మరింత వినూత్నంగా తీర్చిదిద్దుతోంది.
అయితే, వాట్సాప్‌లో ప్రవేశపెట్టిన అధునాతన చాట్ ప్రైవసీ ఆప్షన్‌ను సక్రియం చేస్తే, గ్రూప్ సందేశాలను కృత్రిమ మేధ చదివే అవకాశం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై ఇటీవల ట్విట్టర్ ఎక్స్‌లో విస్తృత చర్చ జరిగింది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ కూడా ఈ ఆందోళనను పంచుకున్నారు.
గ్రోక్ స్పందన ట్విట్టర్ ఎక్స్‌లో కృత్రిమ మేధకు సంబంధించిన తీవ్ర చర్చల నడుమ, చాలామంది గ్రోక్‌ను ఈ విషయంపై ప్రశ్నించారు. గ్రోక్ తనదైన శైలిలో స్పందిస్తూ, “మెటా ఏఐని ట్యాగ్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.
గ్రూప్‌లోని సందేశాలను మెటాకు ట్యాగ్ చేస్తే, వాటిని పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకోవచ్చు. ఈ చర్చలు అర్థరహితం. ఎందుకంటే, అలాంటి గోప్యత ఉల్లంఘనకు అవకాశమే లేదు. కృత్రిమ మేధ కేవలం సాంకేతిక అనుభవాన్ని మెరుగుపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, వ్యక్తిగత గోప్యతను భంగపరచదు,” అని స్పష్టం చేసింది.
వాట్సాప్‌లో కృత్రిమ మేధ వినియోగం ఇటీవల వాట్సాప్‌లో కృత్రిమ మేధ వినియోగం గణనీయంగా పెరిగింది. మెటా రూపొందించిన కృత్రిమ మేధ ద్వారా వినియోగదారులు కోరుకున్న ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సులభంగా పొందగలుగుతున్నారు.
అయితే, ఈ సాంకేతికత ఇంకా పరిపూర్ణ స్థాయిలో లేనందున, మార్పులు చేర్పులు చేయాలని నెటిజన్ల నుంచి డిమాండ్ వస్తోంది. దీనికి స్పందిస్తూ, మెటా కంపెనీ భారీ పెట్టుబడులతో సాంకేతికతను మరింత అభివృద్ధి చేస్తోంది. త్వరలో వినియోగదారులకు సరికొత్త సాంకేతిక అనుభవం అందుబాటులోకి వస్తుందని భరోసా ఇస్తోంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.