Brahmamudi Swapna: ‘బ్రహ్మముడి ‘ స్వప్న ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా.. బుల్లితెరపై ప్రసారమవుతున్న అనేక సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అలాంటి సీరియల్స్‌లో నటించే కొందరు నటీనటులు తెరపై సాంప్రదాయంగా కనిపించినప్పటికీ, బయట మాత్రం హీరోయిన్‌ల స్థాయిలో అందాలను ఆరబోస్తూ అలరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, సోషల్ మీడియాలో ఈ మధ్య బుల్లితెర హీరోయిన్లు సంచలనం సృష్టిస్తున్నారు.
అలాంటి వారిలో ‘బ్రహ్మముడి’ సీరియల్ ఫేమ్ స్వప్న ఒకరు. తన నటనతో సీరియల్‌లో ప్రేక్షకులను కట్టిపడేస్తూనే, బయట హాట్ లుక్స్‌తో యువతకు నిద్రలేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే, తాజాగా ఈమె ‘బ్రహ్మముడి’ సీరియల్ కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె పాత్ర బాగా పాపులర్ కావడంతో రెమ్యూనరేషన్‌లో కూడా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈమె అసలు పేరు రూప. మరి, రూప ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసుకుందాం!
బ్రహ్మముడి స్వప్న రెమ్యూనరేషన్
ఈ మధ్య సినిమా హీరోయిన్ల కంటే సీరియల్ నటీనటులు ఎక్కువ రెమ్యూనరేషన్ పొందుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, సినిమా హీరోయిన్లు కూడా సీరియల్స్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు సీరియల్స్‌లో నటిస్తూ పాపులర్ అవుతున్నారు.
‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్‌లో స్వప్న పాత్రలో నటిస్తున్న రూప తన నటనతో అందరినీ అలరిస్తోంది. ఈమె రెమ్యూనరేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్క రోజుకి ఆమె 20 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. నెలలో 20 రోజులు షూటింగ్ ఉంటే, ఆమె అన్ని రోజులూ పాల్గొంటుంది. దీంతో నెలకు ఆమె సంపాదన లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది.
రూప రియల్ లైఫ్
‘బ్రహ్మముడి’ సీరియల్‌లో మొదట బిగ్ బాస్ ఫేమ్ హమీదా ఖాతూన్ స్వప్న పాత్రలో నటించింది. ఆమె తప్పుకోవడంతో ఆ పాత్రలోకి రూప వచ్చి అద్భుతంగా నటిస్తోంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రూప సుపరిచితమే. ఇప్పటికే ఆమె పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. అంతేకాదు, ఆమె సినిమాల్లో కూడా నటించిందన్న విషయం చాలామందికి తెలియదు.
రూప హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. నర్సాపురం నుంచి వచ్చిన ఈమె హైదరాబాద్‌లోనే చదువుకుంది. నటనపై ఆసక్తితో పలు సీరియల్స్, షోలలో నటిస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా నెగెటివ్ పాత్రల్లోనే కనిపించింది. సీరియల్స్‌లో ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం రూప సంచలనం సృష్టిస్తోంది. హాట్ అందాలతో లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతోంది.