Tv Serial Actress :తెలుగు టెలివిజన్‌లో అనేక ప్రముఖ ఛానెల్స్ ఉన్నాయి, వీటిలో కొన్ని సీరియల్స్‌ను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ సీరియల్స్‌లోని పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండటం వల్ల ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు, వీటిని చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు.
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. వీటిలో నటించే కొంతమంది నటీమణులు తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. చాలామంది ఈ సీరియల్ హీరోయిన్ల వాస్తవ జీవితం గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో వెతుకుతుంటారు. ఇప్పుడు తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్న కొందరు నటీమణుల వాస్తవ వయస్సు గురించి తెలుసుకుందాం.
కావ్య శ్రీ తెలుగు బుల్లితెరలో టాప్ సీరియల్స్‌లో ఒకరిగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్న నటి కావ్య శ్రీ. ‘అమ్మకు తెలియని కోయిలమ్మ’, ‘గువ్వ గోరింక’ వంటి సీరియల్స్‌తో పాపులర్ అయిన ఈమె, ఇటీవల ‘చిన్ని’ సీరియల్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. సీరియల్ హీరో నిఖిల్‌తో బ్రేకప్ తర్వాత ఈమె బాగా హైలైట్ అయింది. కావ్య శ్రీ 1996 సెప్టెంబర్ 6న జన్మించింది. ఆమె వయసు 28 సంవత్సరాలు.
తేజస్విని గౌడ మోడల్ మరియు నటిగా రాణిస్తున్న తేజస్విని గౌడ ‘కోయిలమ్మ’ సీరియల్‌లో చిన్ని పాత్రతో ప్రేక్షకులకు చేరువైంది. తెలుగు, కన్నడ, తమిళ బుల్లితెరపై మెరుస్తున్న ఈ నటి, సువర్ణ ఛానెల్‌లో ప్రసారమైన కన్నడ సీరియల్ ‘బిలి హెండి’లో తొలిసారి నటించింది. ఆ తర్వాత స్టార్ మా లో ‘కోయిలమ్మ’ సీరియల్‌తో పాపులర్ అయింది. ప్రస్తుతం వరుసగా సీరియల్స్‌తో బిజీగా ఉన్న ఈమె 1995 నవంబర్ 22న జన్మించింది. ఆమె వయసు 32 సంవత్సరాలు.
నిహారిక చౌదరి స్టార్ మా లో ప్రసారమవుతున్న ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌లో శృతి పాత్రలో నటిస్తున్న నిహారిక చౌదరి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సీరియల్‌కు ముందు ఆమె పలు సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, సినిమాలు, సీరియల్స్‌తో బిజీగా ఉంది. నిహారిక 1999 జనవరి 2న జన్మించింది. ఆమె వయసు 26 సంవత్సరాలు.
ప్రియాంక జైన్ ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో బాగా పాపులర్ అయిన నటి ప్రియాంక జైన్. ఆ తర్వాత బిగ్ బాస్‌లో కూడా పాల్గొని గుర్తింపు పొందింది. ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె 1998 జులై 2న జన్మించింది. వయసు 27 సంవత్సరాలు.
అన్షు రెడ్డి స్టార్ మా లో టాప్ రేటింగ్‌లో ఉన్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా, సాధారణ కుటుంబంలో కోడలుగా నటిస్తున్న అన్షు రెడ్డి ఈ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయింది. ఆమె 1992 జనవరి 29న జన్మించింది. ఆమె వయసు 33 సంవత్సరాలు.
శోభా శెట్టి ‘కార్తీకదీపం’ సీరియల్‌లో మౌనిత పాత్రతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న శోభా శెట్టి, విలన్‌గా అద్భుత నటనతో గుర్తింపు పొందింది. ఆమె 1990 జనవరి 20న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 33 సంవత్సరాలు.
వీరితో పాటు బుల్లితెరపై నటిస్తున్న చాలామంది హీరోయిన్లు 40 ఏళ్లలోపు వయస్సులోనే ఉన్నారు. కొందరు చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా కొనసాగుతున్నారు.


