Tv Serial Actress:సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్ల భర్తలు ఏం చేస్తుంటారో తెలుసా..?

Tv Serial Actress:సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్ల భర్తలు ఏం చేస్తుంటారో తెలుసా.. ఉదయం లేచినప్పటి నుంచి మనం ఎక్కువగా టీవీని చూస్తూ ఉంటాం. ఇంట్లోని ఆడవాళ్లు టీవీకి ఎంతగా అతుక్కుపోతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖాళీ సమయం దొరికితే చాలు, రిమోట్ పట్టుకొని సీరియల్స్ చూడడం మొదలు పెడతారు. 

బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి సీరియల్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. అయితే, ఈ సీరియల్స్‌లో నటించే హీరోయిన్ల భర్తలు ఏం చేస్తుంటారో చాలామందికి తెలియదు. అద్భుతంగా నటించే ఈ నటీమణుల కుటుంబ సభ్యుల గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తి కనబరుస్తారు. అంతేకాదు, గూగుల్‌లో కూడా వెతుకుతుంటారు. మరి, ఈ రోజు సీరియల్స్‌లో నటిస్తున్న స్టార్ నటీమణుల భర్తలు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం.
తేజస్విని గౌడ 
తేజస్విని గౌడ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. అనేక తెలుగు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇటీవలే ఈమె పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె భర్త మరెవరో కాదు, అమర్ దీప్. అతను కూడా సీరియల్ నటుడు. సీరియల్స్‌తో పాటు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో కూడా అమర్ దీప్ సందడి చేస్తున్నాడు. ఇద్దరూ కెరియర్‌లో బిజీగా ఉన్నారు.

శిరీష 
శిరీష తెలుగులో అనేక సీరియల్స్‌లో నటించింది. 'మొగలిరేకులు' సీరియల్‌తో ఆమె ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 'స్వాతిచినుకులు', 'రాములమ్మ', 'మనసు మమత', 'చెల్లెలి కాపురం', 'పున్నాగ' వంటి సీరియల్స్‌లో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈమె నటుడు నవీన్‌ను పెళ్లి చేసుకుంది, కానీ ఇటీవల కొన్ని కారణాల వల్ల విడిపోయింది.

సుహాసిని 
టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన సుహాసిని, ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తోంది. ప్రస్తుతం 'మామగారు' సీరియల్‌లో నటిస్తోంది. ఆమె భర్త పేరు ధర్మ, అతను కూడా సీరియల్ నటుడు.

కస్తూరి 
సినిమాల్లో పలు పాత్రలు చేసి, ఇప్పుడు బుల్లితెరలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సీనియర్ నటీమణుల్లో కస్తూరి ఒకరు. సీరియల్స్ కంటే వివాదాలతో ఈమె ఎక్కువగా పాపులర్ అవుతోంది. సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. ఆమె భర్త పేరు రవి కుమార్, అతను ఒక డాక్టర్.

మంజుల పరిటాల 
'చంద్రముఖి' సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన మంజుల, అందరికీ తెలిసిన ముద్దుగుమ్మ. ఆమె భర్త నిరూపం పరిటాల, ఒక ప్రముఖ నటుడు. వీరిద్దరూ బుల్లితెరపై అనేక సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలామంది ఈ జాబితాలో ఉంటారు. నటనంటే ఆసక్తితో చాలామంది సీరియల్స్‌లో నటిస్తూ కెరియర్‌ను కొనసాగిస్తున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top