Moringa leaves:జుట్టు రాలిపోతుందా..? ఈ ఆకును ట్రై చేయండీ.. ఈ ఆకు చేసే మ్యాజిక్.. ఇలా జుట్టుకు రాస్తే బోలెడు లాభాలు,,మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. అయితే, ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో, జుట్టును బలంగా మార్చడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా?
మునగాకులో ప్రోటీన్, విటమిన్లు, బీటా కెరోటిన్, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా, యాంటీ-ఫంగల్ గుణాలు కూడా ఉండటం వల్ల చుండ్రును తగ్గిస్తుంది, తలలో దురదను నివారిస్తుంది, మరియు సోరియాసిస్, తామర వంటి బాక్టీరియల్ సమస్యలను దూరం చేస్తుంది. మునగాకు వల్ల కలిగే లాభాలు మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకులోని పోషకాలు మునగాకులో విటమిన్ ఏ, బి, సి, ఇ, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. మునగాకు రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి మరిగించి, ఆ మిశ్రమాన్ని తలకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది. మునగాకు రసం పోషకాలతో నిండి ఉంటుంది, దీన్ని నేరుగా తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
మునగాకు ఉపయోగించే విధానాలు
మునగాకు పేస్ట్ మాస్క్: మునగాకులను మెత్తగా పేస్ట్ చేసి, పెరుగుతో కలిపి తలకు మాస్క్‌లా వేసుకోండి. ఇది జుట్టుకు తేమను అందించి, కుదుళ్లను బలంగా చేస్తుంది.
మునగాకు-ఉసిరి రసం: మునగాకు రసంలో ఉసిరి రసం కలిపి తలకు రాస్తే జుట్టు ఎదుగుదల మెరుగవుతుంది, తల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మునగాకు పొడి ప్యాక్: మునగాకు పొడిని నీటితో కలిపి హెయిర్ ప్యాక్‌గా వాడితే జుట్టు బలంగా, మృదువుగా మారుతుంది.
మునగాకు-తేనె మిశ్రమం: మునగాకు పొడిలో తేనె కలిపి తలకు అప్లై చేయడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు అందుతాయి, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
మునగాకు రసం తాగడం: ఖాళీ కడుపుతో మునగాకు రసం తాగితే రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలపడతాయి, తల ఆరోగ్యంగా ఉంటుంది.
మునగాకు-నిమ్మరసం మాస్క్: మునగాకు పేస్ట్‌లో నిమ్మరసం కలిపి మాస్క్‌గా వాడితే చుండ్రు తగ్గుతుంది.
ఈ సహజసిద్ధమైన మునగాకు ప్యాక్‌లు జుట్టు సమస్యలను తగ్గించి, ఆరోగ్యవంతమైన, అందమైన జుట్టును అందిస్తాయి. రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.