Custard Apple:సీతాఫలాలను ఎవరు తినకూడదు, వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..సీజనల్ పండ్లు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టం. ఏడాది పొడవునా వివిధ సీజన్లలో అనేక రకాల పండ్లు లభిస్తాయి, వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ సీజన్‌లో సీతాఫలాలు సమృద్ధిగా లభిస్తాయి మరియు చాలా మంది వీటిని ఇష్టపడతారు. సీతాఫలాలు తియ్యగా, అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి.
సీతాఫలాల్లోని పోషకాలు మరియు ప్రయోజనాలు: సీతాఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, కారెనోయిక్ యాసిడ్ వంటి పదార్థాలు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి, దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
రోగ నిరోధక శక్తి: సీతాఫలాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తుంది.
కంటి ఆరోగ్యం: సీతాఫలాల్లో లుటీన్, జియాజాంతిన్ వంటి పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. డిజిటల్ తెరల నుంచి వచ్చే నీలి కిరణాలు, సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తాయి. దీని వల్ల వృద్ధాప్యంలో శుక్లాలు (కంటి క్యాటరాక్ట్స్) ఏర్పడకుండా నివారించవచ్చు.
చర్మ ఆరోగ్యం: విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గించి, చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
జీర్ణ వ్యవస్థ: సీతాఫలాల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకం తగ్గుతుంది మరియు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
రక్తపోటు నియంత్రణ: పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉంటుంది. శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. సోడియం స్థాయిలు నియంత్రణలో ఉండటం వల్ల రక్తనాళాలు, కిడ్నీలు, హృదయం ఆరోగ్యంగా ఉంటాయి.
మానసిక ఆరోగ్యం: సీతాఫలాల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శక్తి మరియు ఉత్సాహం: సీతాఫలాలు తక్షణ శక్తిని అందిస్తాయి, దీని వల్ల అలసట, నీరసం, బద్దకం తగ్గి, చురుకుగా, ఉత్సాహంగా ఉండవచ్చు.
సీతాఫలాల్లోని పోషక విలువలు: 100 గ్రాముల సీతాఫలాలు సుమారు 101 క్యాలరీల శక్తిని, 25 గ్రాముల పిండి పదార్థాలు, 12.7 గ్రాముల సహజ చక్కెరలు, 2.4 గ్రాముల ఫైబర్, 1.7 గ్రాముల ప్రోటీన్లు అందిస్తాయి. ఇందులో విటమిన్ సి, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
ఎవరు తినకూడదు? సీతాఫలాలను సాధారణంగా ఎవరైనా తినవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి:
డయాబెటిస్ రోగులు: షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటే, 50 గ్రాములు లేదా ఒక చిన్న సీతాఫలం తినవచ్చు. షుగర్ నియంత్రణలో లేని వారు పూర్తిగా తినకుండా ఉండటం మంచిది.
బరువు తగ్గాలనుకునేవారు: బరువు తగ్గించే ప్రణాళికలో ఉన్నవారు సీతాఫలాలను అధికంగా తినకుండా జాగ్రత్త వహించాలి.
సీతాఫలాలు రుచికరమైనవి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. జాగ్రత్తలు పాటిస్తూ, సమతుల్యంగా తీసుకుంటే ఈ పండ్లు శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.