Pippali Benefits:నల్లగా ఉన్నాయని తీసిపారేయకండి.. సర్వరోగ నివారిణి.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు.. పిప్పళ్లు మిరియాలు లాగానే ఘాటైనవి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయగలవు.
దగ్గు, ఆస్తమా, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు పిప్పళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎలా తీసుకోవాలి? ఇలాంటి విషయాలను ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం రండి.
దగ్గు, ఆస్తమా తగ్గించడానికి: పిప్పళ్ల పొడి 1 గ్రాము, పాత బెల్లం పొడి 5 గ్రాములు తీసుకుని కలిపి చిన్న ఉండలు తయారు చేయండి. పూటకు ఒకటి చొప్పున మింగితే దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. పిప్పళ్లు ఇక్కడ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి.
అసిడిటీ, ఛాతీ మంట, పుల్లని త్రేనుపులు తగ్గించడానికి: 1 గ్రాము పిప్పళ్ల పొడికి అర టీస్పూన్ తేనె కలిపి, ఉదయం-సాయంత్రం భోజనం తర్వాత తీసుకోండి. ఈ సమస్యలు త్వరగా తగ్గుతాయి.
కడుపు ఉబ్బరం తగ్గి, ఆకలి పెరగడానికి: మట్టి పాత్రలో పిప్పళ్లు వేయించి పొడి చేసుకోండి. 3 గ్రాముల పొడికి ఒక టీస్పూన్ తేనె కలిపి, రోజుకు రెండు సార్లు చప్పరించి మింగండి. కడుపు ఉబ్బరం తగ్గి, ఆకలి బాగా వేస్తుంది.
మైగ్రేన్ తలనొప్పి తగ్గించడానికి: పిప్పళ్లు, వస పొడులను సమాన భాగాల్లో కలిపి, 3 గ్రాముల మోతాదులో గోరువెచ్చని నీటితో లేదా పాలతో రోజుకు రెండు సార్లు తీసుకోండి. మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
వాంతులు, వికారం, తలతిరగడం తగ్గించడానికి: అర గ్రాము పిప్పళ్ల పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి, రోజుకు రెండు సార్లు తాగండి. ఈ సమస్యలు త్వరగా తగ్గుతాయి.
అధిక బరువు తగ్గించడానికి: 2 గ్రాముల పిప్పళ్ల పొడికి ఒక టీస్పూన్ తేనె కలిపి, ఉదయం-సాయంత్రం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక గంట పాటు ఏమీ తినకూడదు. ఇలా చేస్తేనే ఫలితం కనిపిస్తుంది.
ప్రసవం తర్వాత పొట్ట సమస్యలు తగ్గించడానికి: ఒక గ్లాసు మజ్జిగలో 2 గ్రాముల పిప్పళ్ల పొడి కలిపి, ఉదయం-సాయంత్రం తీసుకోండి. పొట్ట తగ్గి, సమతులంగా అవుతుంది. తల్లి ఆరోగ్యంగా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


