Mustard Seeds:చిట్టివేగానీ మహా గట్టివి..! పోషకాలు..ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరండోయ్..ఆవాలు లేని పోపు ఊహించలేం కదా! పచ్చళ్లు, ఆవకాయల్లో ఆవాలు పాత్ర ఎంతో కీలకం. అనేక కూరలు ఆవపిండితో కలిపి వండుతారు. ఆవాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి, గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి, శరీరంలో మంటను తగ్గిస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఆవాలు గుండెను కాపాడుతుంది, మంచి కొవ్వులను పెంచుతుంది. క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే గుణాలు కూడా ఉన్నాయి. ఆవపిండిలో సెలీనియం ఉంటుంది – ఇది ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, శ్వాసలో మంటను తగ్గిస్తుంది.
డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, అజీర్తితో ఇబ్బంది పడేవారు ఆవపిండిని భోజనంలో చేర్చుకోవచ్చు. పొటాషియం, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి – ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. దగ్గు, జలుబు వంటి సమస్యలకు త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ఆవాల్లోని సమృద్ధి పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి, జుట్టును బలపరుస్తాయి. విటమిన్ A, K, Cలు ముడతలు, వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి. ఆవపిండిలో యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలున్నాయి.
సల్ఫర్ మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది. సోరియాసిస్, రింగ్‌వార్మ్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఆవ నూనె పూయడం వల్ల గాయాలు త్వరగా మాయమవుతాయి. ఆవ నూనె అనేక ఔషధ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.
ఆవ కూర తినవచ్చు. ఆవపొడి లేదా గింజలుగా రోజూ కూరల్లో వాడుకోవచ్చు. ఆవ నూనెను కూరగాయల వేయించడానికి, మాంసం/చేపల వంటల్లో, సలాడ్‌పై చల్లుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


