Snake gourd:పొట్లకాయను అస్సలు తక్కువ అంచనా వేయొద్దు.. ఆ సమస్యలకు యముడే..పొట్లకాయలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తాయి. ఇంతకంటే ఏమి కావాలి? ఈరోజు పొట్లకాయ లాభాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
క్యాన్సర్‌ను నిరోధించే శక్తి పొట్లకాయలో ఉంది. దీన్ని తరచూ తింటే కీళ్ల నొప్పులు, వాపులు రావు. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. జ్వరం, కామెర్లు వచ్చినవారు పొట్లకాయ తింటే త్వరగా కోలుకుంటారు.
గుండె జబ్బులున్నవారికి కూడా ఇది అద్భుతం. హార్ట్ అటాక్ రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలు బలంగా మారతాయి. కామెర్లు తగ్గుతాయి. ధనియాలతో కలిపి తింటే కామెర్లు త్వరగా మాయమవుతాయి.
పొట్లకాయలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్వరాన్ని తగ్గిస్తాయి. జ్వరం వచ్చినప్పుడు దీన్ని తింటే త్వరగా ఉపశమనం. ఆకులను శరీరంపై రుద్దినా జ్వరం తగ్గుతుంది.
నీరసం, అలసట రాకుండా చేస్తుంది. కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె దడ, ఛాతీ నొప్పి, హై బీపీ ఉన్నవారు రోజూ 30 ఎంఎల్ పొట్లకాయ రసం తాగాలి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, బీపీ తగ్గుతుంది.
పొట్లకాయ పేస్ట్‌తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టుకు పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండు, ఇతర సమస్యలు తొలగుతాయి. నిద్ర కూడా చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఉండదు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


