అమరావతిలో భాగమైన విజయవాడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. జాతీయ రహదారి, విమానాశ్రయం కనెక్టివిటీ ఉన్న నేపథ్యంలో అభివృద్ధి సాధ్యమవుతోంది. రాజధాని భాగంగా పెద్ద ఎత్తున పనులు వేగం పుంజుకుంటున్నాయి.
విజయవాడలో ఐటీ రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేస్తోంది. గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ఐటీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మేధా ఐటీ పార్క్ హైటెక్ సిటీగా పేరొందింది. HCL Technologies, Tech Mahindra, Infosys, Wipro, Cognizant వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు కేశరపల్లిలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
గన్నవరం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. అపార్ట్‌మెంట్లు, ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌ల నిర్మాణం జోరుగా సాగుతోంది. భవిష్యత్తులో మరిన్ని కార్యాలయాలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ భూముల లభ్యత, విమానాశ్రయ అభివృద్ధి వల్ల రాకపోకలు పెరిగి ప్రాంతం మరింత వికసిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
డిస్‌క్లైమర్: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీన్ని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం వంటి పెట్టుబడులు లాభనష్టాలకు లోనవుతాయి. మీ నిర్ణయాలకు telugulifestyle బాధ్యత వహించదు. పెట్టుబడుల ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.


