Okra Water:ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీళ్ళు తాగితే ఆరోగ్యంపై ఎలాంటి బెంగా ఉండదంటే నమ్మండి.. నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే శరీర రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి ముఖ్య అవయవాలు పూర్తి ఆరోగ్యంగా ఉంటాయి. కానీ సాధారణ నీళ్లకు బదులుగా నీటిలో కొన్ని బెండకాయ ముక్కలు నానబెట్టి తాగితే రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో పెద్దలు చెప్పే మాటల్లో ఒకటైన ఈ అలవాటు ఎంతో మేలు చేస్తుంది. బెండకాయలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ K, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగితే ఈ క్రింది ప్రయోజనాలు పొందవచ్చు:
బెండకాయ నీటి ప్రయోజనాలు:
మలబద్ధకం తగ్గుతుంది: ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేస్తుంది.
మధుమేహ నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.
ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది: యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో కీళ్ల నొప్పి తగ్గుతుంది.
కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం: టాక్సిన్స్‌ను బయటకు పంపి అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువు తగ్గుతుంది: ఖాళీ కడుపుతో తాగితే 7 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.
చర్మం మెరుస్తుంది: పొడిబారడం, మొటిమలు తగ్గి చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ఎలా తయారు చేయాలి?
రాత్రిపూట ఒక గాజు సీసాలో సాధారణ నీటిని నింపండి.
2-3 బెండకాయలను సన్నగా ముక్కలు చేసి వేయండి.
రాత్రంతా నానబెట్టండి.
ఉదయం వడకట్టి, ఖాళీ కడుపుతో తాగండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


