Bhogi Festival 2026:భోగి రోజు పొరపాటున కూడా ఈ 4 పనులు చేయకండి.. లక్ష్మీదేవి కటాక్షం ఉండదు.. రేపు (జనవరి 14, 2026) భోగి పండుగ. ఇది కేవలం పాత వస్తువులను కాల్చేయడం మాత్రమే కాదు.. మనలోని చెడును వదిలించుకుని కొత్త జీవితాన్ని ఆహ్వానించే పర్వదినం. అయితే, తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల పుణ్యం సంగతి దేవుడెరుగు.. దరిద్రం చుట్టుకునే ప్రమాదం ఉంది.
పెద్దలు మరియు శాస్త్రం ప్రకారం.. భోగి రోజు అస్సలు చేయకూడని 4 పనులు ఇవే:
1. ప్లాస్టిక్ కాలిస్తే మహా పాపం: చాలామంది పాత సామాన్లు కదా అని ప్లాస్టిక్ కుర్చీలు, కవర్లు, టైర్లు, రబ్బరు వస్తువులను భోగి మంటల్లో వేస్తారు.
నష్టం: దీనివల్ల విష వాయువులు విడుదలై మీ ఆరోగ్యం పాడవుతుంది. పంచభూతాలను కలుషితం చేయడం వల్ల వాస్తు దోషం కూడా కలుగుతుంది.
ఏం చేయాలి? కేవలం ఆవు పిడకలు, ఎండు కట్టెలు మాత్రమే వాడండి.
2. ఆ టైమ్ దాటాక స్నానం వద్దు: భోగి రోజు ఎప్పుడు పడితే అప్పుడు లేచి స్నానం చేయకూడదు.
కచ్చితంగా సూర్యోదయానికి ముందే (బ్రాహ్మీ ముహూర్తంలో) నువ్వుల నూనె రాసుకుని తలస్నానం చేయాలి. సూర్యుడు వచ్చాక చేసే స్నానానికి ఫలితం ఉండదు.
3. ఆ రోజు ఇది తినకండి: పండుగ కదా అని మాంసాహారం (Non-Veg), మద్యం జోలికి వెళ్లకండి.ఈ రోజు సాత్విక ఆహారం (పొంగలి, పులిహోర) తింటేనే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
4. గొడవలకు దూరంగా: భోగి అంటేనే మనసులోని ద్వేషాన్ని కాల్చేయడం. అలాంటి పవిత్రమైన రోజున ఇంట్లో గొడవలు పడటం, పిల్లలను కొట్టడం, ఇతరులను తిట్టడం చేస్తే.. లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగుపెట్టదు. ప్రశాంతంగా ఉంటేనే సిరిసంపదలు వస్తాయి.
ఐశ్వర్యం కోసం ఏం చేయాలి? భోగి మంటల్లో గుప్పెడు నల్ల నువ్వులు, ఆవు నెయ్యి వేయండి. ఇవి శని దోషాన్ని పోగొట్టి, అష్టైశ్వర్యాలను కలిగిస్తాయి. సాయంత్రం పిల్లలకు భోగి పళ్లు పోయడం మర్చిపోవద్దు.
ఈ చిన్న నియమాలు పాటించండి.. ఆనందంగా సంక్రాంతికి స్వాగతం పలకండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


