Washing Machine Hack:బట్టలకు వెంట్రుకలు అంటుకుంటున్నాయా? వాషింగ్ మెషీన్ లో ఈ చిన్న వైప్ వేస్తే చాలు.

Washing Machine Hack
Washing Machine Hack:వాషింగ్ మెషీన్‌లో బట్టల మధ్యలో 'వెట్ వైప్' వేసి చూడండి.. ఆ తర్వాత జరిగే మ్యాజిక్ చూస్తే షాక్ అవుతారు!

బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? అయితే ఉతికిన తర్వాత బట్టలకు సన్నని దారాలు (Lint), వెంట్రుకలు లేదా పెంపుడు జంతువుల జుట్టు (Pet Hair) అతుక్కుని ఉండటం చూసి చిరాకు పడుతున్నారా?

ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. మీ ఇంట్లో ఉండే ఒక చిన్న 'వెట్ వైప్ (Wet Wipe)' మీ బట్టలను డ్రై క్లీనింగ్ చేసినట్లుగా మారుస్తుంది. ఈ సింపుల్ ట్రిక్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే.. ఈరోజే ట్రై చేస్తారు!

అసలు మ్యాజిక్ ఏంటి?
మనం వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసేటప్పుడు.. వాటి మధ్యలో 1 లేదా 2 వెట్ వైప్స్ వేయాలి. అంతే!

ఎలా పనిచేస్తుంది?: మెషీన్ తిరుగుతున్నప్పుడు బట్టల నుంచి విడిపోయిన దారాలు, వెంట్రుకలు నీటిలో తేలుతుంటాయి. వెట్ వైప్స్ కు ఉండే గరుకు స్వభావం వల్ల.. అవి ఒక అయస్కాంతం (Magnet) లాగా ఆ చెత్తనంతా తన వైపు లాక్కుంటాయి.

ఫలితం: వాష్ అయ్యాక వైప్స్ ని తీసి చూస్తే.. బట్టలకు అంటుకోవాల్సిన మురికి, వెంట్రుకలన్నీ వైప్స్ కి అంటుకుని ఉంటాయి. బట్టలు మాత్రం తళతళా మెరుస్తాయి.

ఎలాంటి వైప్స్ వాడాలి? (ముఖ్యమైన రూల్స్)
ఏది పడితే అది వాడితే మెషీన్ పాడైపోతుంది. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి:

క్లాత్ వైప్స్ మాత్రమే: పేపర్ తో చేసిన టిష్యూ లాంటి వైప్స్ వాడకూడదు. అవి నీటిలో నాని ముక్కలైపోతాయి. చేతితో లాగితే చిరగని ఫ్యాబ్రిక్ (Fabric) వైప్స్ మాత్రమే వాడాలి.

టెస్ట్ చేయండి: వైప్ ని రెండు చేతులతో పట్టుకుని లాగితే అది సాగాలి కానీ.. చిరగకూడదు. అప్పుడే అది మెషీన్ స్పీడ్ ని తట్టుకోగలదు.

వాసన లేనివి: వీలైనంత వరకు సెంటు వాసన లేని (Unscented) వైప్స్ వాడితే మంచిది.

ఎన్ని వేయాలి?
తక్కువ బట్టలు ఉంటే 1 వైప్ సరిపోతుంది.ఫుల్ లోడ్ వేస్తే లేదా పెట్ హెయిర్ ఎక్కువగా ఉంటే 3 వైప్స్ వరకు వేయవచ్చు.

ముఖ్య గమనిక: వాషింగ్ పూర్తవగానే వెంటనే వైప్స్ ని తీసి డస్ట్ బిన్ లో పారేయాలి. లేదంటే ఆరిపోయాక ఆ చెత్త మళ్ళీ బట్టలకు అంటుకుంటుంది.

లాభం: ఈ టి్రిక్ వల్ల కేవలం బట్టలే కాదు.. మీ వాషింగ్ మెషీన్ ఫిల్టర్లు, డ్రైన్ పైపులు కూడా బ్లాక్ అవ్వకుండా సేఫ్ గా ఉంటాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

ALSO READ:ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లో కూర్చునే మొబైల్ నంబర్ మార్చుకోండిలా! కేంద్రం భారీ గుడ్ న్యూస్..
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top