Leg Cramps : కాళ్ల తిమ్మిర్లను 'లైట్' తీసుకుంటున్నారా? ఈ 'సైలెంట్ కిల్లర్' గురించి తెలిస్తే వెంటనే అలర్ట్ అవుతారు!

Leg Cramps
Leg Cramps : కాళ్ల తిమ్మిర్లను 'లైట్' తీసుకుంటున్నారా? ఈ 'సైలెంట్ కిల్లర్' గురించి తెలిస్తే వెంటనే అలర్ట్ అవుతారు!

రోజంతా ఆఫీసులో కూర్చొని లేదా నిలబడి పనిచేసి ఇంటికి రాగానే కాళ్లు గుంజుతున్నాయా? రాత్రి పడుకున్నప్పుడు పిక్కలు పట్టినట్లు అవుతున్నాయా? "అలసట వల్లనే కదా, రేపటికి తగ్గిపోతుందిలే" అని చాలామంది ఈ నొప్పులను నిర్లక్ష్యం చేస్తుంటారు. 

అయితే, కాళ్లలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు కేవలం అలసట వల్ల మాత్రమే రావని.. అవి శరీరంలో దాగి ఉన్న ఓ తీవ్రమైన అనారోగ్యానికి ముందస్తు హెచ్చరికలు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ 'సైలెంట్ కిల్లర్' వ్యాధి ఏంటి? ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ వాస్తవాలు మీకోసం..

ఆ సైలెంట్ కిల్లర్ పేరే 'పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్' (PAD)
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డిమిత్రి యారోనోవ్ చెబుతున్న దాని ప్రకారం.. మీరు నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి లేదా తిమ్మిరి వచ్చి, కాసేపు కూర్చోగానే (విశ్రాంతి తీసుకోగానే) ఆ నొప్పి తగ్గిపోతుంటే అది 'పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్' (PAD) అయ్యే ప్రమాదం ఉంది.

ఏమిటీ వ్యాధి? మన కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో (Arteries) కొవ్వు పేరుకుపోయి అడ్డంకులు ఏర్పడటమే ఈ వ్యాధి.

రక్తం పారాల్సిన చోట అడ్డంకులు ఏర్పడినప్పుడు శరీరం ముందుగా చేసే హెచ్చరికే ఈ కాళ్ల తిమ్మిర్లు. దీన్ని సకాలంలో గుర్తించకపోతే పాదాలు మొద్దుబారిపోయి, ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది.

శరీరంలో ఈ లోపాలు ఉన్నా తిమ్మిర్లు తప్పవు..

కేవలం రక్తనాళాల సమస్యే కాకుండా, మన శరీరంలో మరికొన్ని లోపాలు ఉన్నప్పుడు కూడా కండరాలు మొరాయిస్తాయి:

ఎలక్ట్రోలైట్స్ లోపం: శరీరంలో మెగ్నీషియం, పొటాషియం లేదా కాల్షియం స్థాయిలు పడిపోయినప్పుడు కండరాలు సరిగ్గా పనిచేయవు.

విటమిన్ల లోపం: విటమిన్ D లోపం, రక్తహీనత (ఎనీమియా) కారణంగా కాళ్లు గుంజుతాయి.

ఇతర కారణాలు: థైరాయిడ్ సమస్యలు, డీహైడ్రేషన్ (నీళ్లు తక్కువగా తాగడం), కొత్తగా ఏవైనా మందులు వాడటం లేదా జిమ్‌లో మరీ హెవీగా వర్కౌట్స్ చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

ఎప్పుడు అలర్ట్ అవ్వాలి? (Red Flags)
సాధారణంగా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం లేదా డీహైడ్రేషన్ వల్ల వచ్చే తిమ్మిర్లు నీళ్లు తాగినా, కాస్త అటూఇటూ నడిచినా తగ్గిపోతాయి. కానీ..

పడుకున్నప్పుడు లేదా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ తిమ్మిర్లు వస్తుంటే..

కాళ్లలో జలదరింపుతో పాటు, కండరాలు పూర్తిగా బలహీనపడినట్లు అనిపిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.

వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి!
మధుమేహం (డయాబెటిస్), థైరాయిడ్ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కాళ్ల నొప్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వారానికి మూడు నాలుగు సార్లు కాళ్లు పీకుతున్నా, తిమ్మిర్లు వస్తున్నా వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ లెవల్స్, కిడ్నీ పనితీరును చెక్ చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో రాబోయే పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

చివరి మాట: కాళ్ల నొప్పులు కదా అని పెయిన్ కిల్లర్స్ వేసుకుని కాలం వెళ్లదీయకండి. అది మీ ప్రాణాలకే రిస్క్ తెచ్చిపెట్టొచ్చు. సమస్యను గుర్తించి సరైన వైద్యం తీసుకోవడమే ఉత్తమం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top