Government Jobs :డిగ్రీ పాసయ్యారా? కేంద్ర ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.55,000 జీతం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలనా? అయితే మీకోసం ఒక 'గోల్డెన్ ఛాన్స్' వచ్చింది. ప్రముఖ విద్యాసంస్థ IIIT రాంచీ (IIIT Ranchi) నుండి 2026 సంవత్సరానికి గాను నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 19 పోస్టులే ఉన్నా.. ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు కావడం విశేషం.
ఏయే పోస్టులు ఉన్నాయి?
జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant)
జూనియర్ టెక్నీషియన్ (CSE/ECE/Library)
జూనియర్ సూపరింటెండెంట్
అసిస్టెంట్ & డిప్యూటీ రిజిస్ట్రార్
ఎవరు అర్హులు? (Eligibility): ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏంటంటే.. తక్కువ చదువు ఉన్నవారికి కూడా అవకాశాలు ఉన్నాయి.
జూనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ ఉండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు.
జూనియర్ టెక్నీషియన్: డిప్లమా / బీటెక్ లేదా ఐటీఐ (2 ఏళ్ల అనుభవం) చేసినవారు అర్హులు.
జూనియర్ సూపరింటెండెంట్: డిగ్రీ (First Class) తో పాటు అనుభవం ఉండాలి.
జీతం ఎలా ఉంటుంది? (Salary): ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంచి జీతాలు ఉంటాయి.
జూనియర్ అసిస్టెంట్/టెక్నీషియన్ పోస్టులకే నెలకు బేసిక్ పే రూ.21,700 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని అలవెన్సులు కలిపి చేతికి మంచి మొత్తం వస్తుంది.
పైస్థాయి పోస్టులకు ఏకంగా రూ.2 లక్షల వరకు పే స్కేల్ ఉంది.
అప్లికేషన్ వివరాలు:
ప్రారంభం: ఫిబ్రవరి 01, 2026
చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2026 (రాత్రి 11:59 వరకు)
అప్లై విధానం: ఆన్‌లైన్ (అధికారిక వెబ్‌సైట్ ద్వారా).
ఎంపిక ఎలా? రాత పరీక్ష (Written Test) మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ గురించి నోటిఫికేషన్‌లో చూడాలి.
అప్లై చేయాలా? కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అయినట్టే. పోస్టులు తక్కువని చూడకండి.. మీకు కావాల్సింది ఒక్క పోస్టు మాత్రమే. అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

.webp)
