Vankaya:చేదు వంకాయను కోయకుండానే ఇలా గుర్తించవచ్చు.. ఈ సీక్రెట్ తెలిస్తే ఇక మోసపోరు!
"ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి" అని పాట పాడుకునే వంకాయ కూరంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర కలుపుకుని తింటే ఆ స్వర్గమే వేరు!
కానీ, మార్కెట్ నుంచి సంచి నిండా వంకాయలు తెచ్చాక.. తీరా కోసి చూస్తే లోపల పురుగులు, ముదిరిపోయిన గింజలు, వండాక చేదు రుచి వస్తే? మూడ్ మొత్తం పాడవుతుంది కదా! అందుకే ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ బధోరియా వంకాయను కోయకుండానే అది మంచిదో కాదో తెలుసుకునే సూపర్ టిప్స్ చెప్పారు. అవేంటో చూసేయండి!
మంచి వంకాయను గుర్తించే 4 సింపుల్ చిట్కాలు:
1. బరువు తక్కువే.. రుచి ఎక్కువ! సాధారణంగా కూరగాయలు బరువుగా ఉంటే మంచివి అనుకుంటాం. కానీ వంకాయ విషయంలో ఇది రివర్స్!
వంకాయ సైజును బట్టి అది తేలికగా (Light weight) ఉండాలి.
బరువుగా అనిపిస్తే అందులో గింజలు ఎక్కువగా ఉండి, ముదిరిపోయినట్లు లెక్క. అలాంటివి వండితే చేదు వస్తాయి.
2. నొక్కి చూడండి.. సీక్రెట్ తెలుస్తుంది! వంకాయను కొనేటప్పుడు వేలితో సున్నితంగా నొక్కండి.
నొక్కినప్పుడు చర్మం మళ్లీ వెనక్కి వస్తే (Bounce back) అది లేతగా, బాగుందని అర్థం.
మరీ గట్టిగా, రాయిలా ఉంటే లోపల గింజలు ఎక్కువగా ఉంటాయని గ్రహించండి. చర్మం మృదువుగా ఉండే వాటినే ఎంచుకోండి.
3. తొడిమ రంగు గమనించారా? వంకాయ పైన ఉండే కాడ (తొడిమ) ఎప్పుడూ ఆకుపచ్చగా, తాజాగా ఉండాలి.
తొడిమ నల్లగా మారినా, ఎండిపోయినట్లు ఉన్నా అది పాత సరుకు అని అర్థం. అలాంటివి కొనకండి.
4. రంధ్రాలు ఉంటే డేంజర్! వంకాయ మీద చిన్న రంధ్రం (Hole) లేదా పగులు ఉన్నా అస్సలు బుట్టలో వేయకండి.
రంధ్రం ఉందంటే కచ్చితంగా లోపల పురుగు ఉందని అర్థం.
నిగనిగలాడే చర్మం, ఎటువంటి మచ్చలు లేని వంకాయలే ఆరోగ్యానికి, రుచికి మంచివి.
చివరగా: ఈసారి మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఈ చిన్న టిప్స్ పాటించి చూడండి.. మీరు చేసే వంకాయ కూర రుచి అదిరిపోవాల్సిందే!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


