Arunachalam Giri Pradakshina:అరుణాచల భక్తులకు శుభవార్త.. 2026 గిరి ప్రదక్షిణ తేదీలు వచ్చేశాయ్! ఏ నెలలో ఎప్పుడంటే?

Arunachalam Giri Pradakshina
Arunachalam Giri Pradakshina:అరుణాచల భక్తులకు శుభవార్త.. 2026 గిరి ప్రదక్షిణ తేదీలు వచ్చేశాయ్! ఏ నెలలో ఎప్పుడంటే?

Arunachalam Giri Pradakshina Dates 2026: మీరు 2026లో అరుణాచలం వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? పంచభూత క్షేత్రాల్లో అగ్ని లింగ క్షేత్రమైన తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధమవుతున్నారా? అయితే ప్రతినెలా వచ్చే పౌర్ణమి తిథులు, ప్రదక్షిణకు అనుకూలమైన సమయాల పూర్తి లిస్ట్ మీకోసం.

తమిళనాడులోని తిరువణ్ణామలై (అరుణాచలం) క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడి కొండను సాక్షాత్తు శివలింగంగా భావిస్తారు. సుమారు 14 కిలోమీటర్ల మేర ఉండే ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య అనే అష్టలింగాలు దర్శనమిస్తాయి. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం వల్ల సకల పాపాలు తొలగి, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మీరు కూడా 2026లో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే.. నెలల వారీగా తేదీలు మరియు సమయాలు ఇక్కడ చూడండి.

2026 అరుణాచలం గిరి ప్రదక్షిణ షెడ్యూల్

📅 మార్చి 2026 (ఫాల్గుణ పౌర్ణమి)
ప్రారంభం: మార్చి 2వ తేదీ, సాయంత్రం 05:55 గంటలకు
ముగింపు: మార్చి 3వ తేదీ, సాయంత్రం 05:07 గంటలకు

📅 ఏప్రిల్ 2026 (చైత్ర పౌర్ణమి)
ప్రారంభం: ఏప్రిల్‌ 1వ తేదీ, ఉదయం 07:06 గంటలకు
ముగింపు: ఏప్రిల్‌ 2వ తేదీ, సాయంత్రం 07:41 గంటలకు

📅 మే 2026 (వైశాఖ పౌర్ణమి)
ప్రారంభం: ఏప్రిల్‌ 30వ తేదీ, రాత్రి 09:12 గంటలకు
ముగింపు: మే 1వ తేదీ, రాత్రి 10:52 గంటలకు

📅 జూన్ 2026 (జ్యేష్ఠ పౌర్ణమి)
ప్రారంభం: జూన్‌ 29వ తేదీ, తెల్లవారుజామున 03:06 గంటలకు
ముగింపు: జూన్‌ 30వ తేదీ, ఉదయం 05:26 గంటలకు

📅 జులై 2026 (గురు పౌర్ణమి / ఆషాఢ పౌర్ణమి)
ప్రారంభం: జులై 28వ తేదీ, సాయంత్రం 06:18 గంటలకు
ముగింపు: జులై 29వ తేదీ, ఉదయం 08:05 గంటలకు

📅 ఆగస్టు 2026 (శ్రావణ పౌర్ణమి)
ప్రారంభం: ఆగస్టు 27వ తేదీ, ఉదయం 09:08 గంటలకు
ముగింపు: ఆగస్టు 28వ తేదీ, ఉదయం 09:48 గంటలకు

📅 సెప్టెంబర్ 2026 (భాద్రపద పౌర్ణమి)
ప్రారంభం: సెప్టెంబర్‌ 25వ తేదీ, రాత్రి 11:06 గంటలకు
ముగింపు: సెప్టెంబర్‌ 26వ తేదీ, రాత్రి 10:18 గంటలకు

📅 అక్టోబర్ 2026 (ఆశ్వయుజ పౌర్ణమి)
ప్రారంభం: అక్టోబర్‌ 25వ తేదీ, ఉదయం 11:55 గంటలకు
ముగింపు: అక్టోబర్‌ 26వ తేదీ, ఉదయం 09:41 గంటలకు

📅 నవంబర్ 2026 (కార్తీక పౌర్ణమి - మహా దీపం)
ఈ నెలకు అరుణాచలంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవంబర్ 24న కృత్తిక నక్షత్ర మహా దీపోత్సవం జరుగుతుంది.
ప్రారంభం: నవంబర్‌ 23వ తేదీ, రాత్రి 11:42 గంటలకు
ముగింపు: నవంబర్‌ 24వ తేదీ, రాత్రి 08:23 గంటలకు

📅 డిసెంబర్ 2026 (మార్గశిర పౌర్ణమి)
తేదీలు: డిసెంబర్‌ 23 - 24 తేదీల్లో గిరి ప్రదక్షిణ చేయవచ్చు.

ముఖ్య గమనిక: ఎండ, వాన, చలి అని చూడకుండా భక్తులు నిత్యం ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. పురాణాల ప్రకారం దేవతలు, మహర్షులు కూడా వివిధ జీవరాశుల రూపంలో అరుణాచలేశ్వరుడిని ప్రదక్షిణ చేస్తారని ప్రతీతి. అందుకే ఈ పవిత్రమైన తేదీల్లో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుని, అరుణాచలేశ్వరుడి కృపకు పాత్రులవ్వండి.

ఓం అరుణాచలేశ్వరాయ నమః 

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top