Losing shoes at temple:గుడిలో చెప్పులు పోయాయా? కంగారు పడకండి.. అది మీకు మంచిదే! ఎందుకంటే..?
గుడికి వెళ్లినప్పుడు చాలామందికి ఎదురయ్యే అనుభవం.. బయటకు రాగానే చెప్పులు మాయం! కోపం, చిరాకు రావడం సహజం. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలా జరగడం వెనుక ఒక పెద్ద 'శుభ సంకేతం' దాగి ఉందట.
దైవ దర్శనానికి వెళ్లినప్పుడు మన చెప్పులు పోతే.. "ఛ.. నాకే ఎందుకు ఇలా జరిగింది?" అని బాధపడతాం. కానీ పెద్దలు, జ్యోతిష్య పండితులు మాత్రం "మంచి జరిగింది" అని అంటారు. అసలు గుడిలో చెప్పులు పోవడం శుభమా? అశుభమా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలేంటో చూడండి.
1. శని వదిలిపోయినట్టేనా? (The Shani Connection)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాదాలకు, పాదరక్షలకు కారకుడు 'శని భగవానుడు'. ఎవరి జాతకంలో అయితే ఏలినాటి శని లేదా శని దోషం ఉంటుందో.. వారు గుడి దగ్గర చెప్పులు పోగొట్టుకుంటే సాక్షాత్తు ఆ శని ప్రభావం వారి నుంచి దిగిపోయినట్లుగా భావిస్తారు.
మీ పాపభారం తగ్గుతుంది. జీవితంలో ఉన్న అప్పులు, అడ్డంకులు తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో శుభ పరిణామాలు జరుగుతాయని దీని అర్థం.
2. అహంకారం కూడా వదిలేసినట్టే..
కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా దీనికి గొప్ప అర్థం ఉంది. గుడి బయట చెప్పులు విడవడమంటే.. మనలోని 'అహంకారం', 'గర్వం', 'ద్వేషం' వంటి నెగెటివ్ ఆలోచనలను బయటే వదిలేసి, దేవుడి ముందు స్వచ్ఛమైన మనసుతో శరణాగతి పొందడం అని అర్థం. కాబట్టి చెప్పులు పోతే, మీలోని పీడ పోయినట్టే భావించాలి.
3. రామాయణంలో ఏముంది?
పాదరక్షలకు మన పురాణాల్లోనూ విశేష స్థానం ఉంది. శ్రీరాముడు అడవులకు వెళ్లినప్పుడు, భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై పెట్టి పూజించాడు. అంటే పాదరక్షలు కేవలం కాళ్లకు రక్షణే కాదు.. అవి ఒక బాధ్యతకు, అధికారానికి, క్రమశిక్షణకు ప్రతీకలు.
4. శని దోషం పోవాలంటే ఏం చేయాలి?
ఒకవేళ మీ చెప్పులు పోకపోతే బాధపడకండి.. శని దోషం ఉన్నవారు కావాలనే ఒక పరిహారం చేయవచ్చు.
దానం: పేదవారికి లేదా అవసరమైన వారికి పాదరక్షలు దానం చేయడం చాలా మంచిది.
ఎప్పుడు చేయాలి?: శనివారం, బుధవారం లేదా సోమవారం నాడు చెప్పులు దానం చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది, కష్టాలు తీరుతాయి.
చివరగా.. తదుపరి సారి మీరు గుడికి వెళ్లినప్పుడు చెప్పులు కనిపించకపోతే.. చిరాకు పడకండి. "పోతే పోయింది.. నా దరిద్రం వదిలింది" అనుకుని సంతోషంగా ఇంటికి వెళ్లండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


