Moong Dal Chilla:రోజూ ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? పిండి పులియబెట్టే పనే లేకుండా 10 నిమిషాల్లో ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేయండి!

Moong Dal Chilla
Moong Dal Chilla:ఇది నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అయిన 'చిల్లా'. మన పెసరట్టుకు కాస్త దగ్గరగా ఉంటుంది కానీ, ఇందులో కూరగాయలు కూడా చేర్చడం వల్ల పోషకాలు డబుల్ అవుతాయి.

కావాల్సిన పదార్థాలు:
నానబెట్టిన పెసలు (లేదా పెసర పప్పు): 1 కప్పు
అల్లం ముక్క: అంగుళం
పచ్చిమిర్చి: 2
తురిమిన క్యారెట్: అర కప్పు
ఉప్పు: తగినంత

తయారీ విధానం:
రాత్రింతా నానబెట్టిన పెసలను ఉదయాన్నే కడిగి.. అందులో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో మెత్తని పేస్ట్‌లా (దోశ పిండిలా) పట్టుకోవాలి.ఆ పిండిలో తురిమిన క్యారెట్ వేసి బాగా కలపాలి.

పెనం వేడి చేసి ఈ పిండిని కొద్దిగా మందంగా దోశలా వేసుకోవాలి.పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుంటే వేడివేడి హెల్తీ చిల్లా రెడీ. దీన్ని పుదీనా చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది.

ప్రయోజనాలు: పెసల్లో ప్రొటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, పొట్ట దగ్గరి కొవ్వు కరిగించడానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top