Business Idea:ఇంటి నుంచే బిజినెస్.. డిమాండ్ ఫుల్.. లాభాలు సూపర్! యంత్రం ఉంటే చాలు.. సొంత ఊర్లో ఉంటూనే రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ప్లాస్టిక్ నిషేధం తర్వాత విపరీతమైన డిమాండ్ పెరిగిన "పేపర్ ప్లేట్ల తయారీ (Paper Plate Making)" వ్యాపారం ప్రారంభించండి.
ఫంక్షన్లు, హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ బండ్ల దగ్గర పేపర్ ప్లేట్ల వాడకం పెరిగింది. కానీ తయారీదారులు తక్కువగా ఉన్నారు.
పెట్టుబడి: కేవలం రూ. 20 వేల నుంచి రూ. 50 వేల లోపు చిన్నపాటి ఆటోమేటిక్ మెషీన్ కొనుగోలు చేయవచ్చు.
స్థలం: దీనికి పెద్ద గోడౌన్ అవసరం లేదు. ఇంట్లో ఒక చిన్న గదిలో మెషీన్ పెట్టుకోవచ్చు.
రాబడి: కిలో ముడిసరుకు (Raw material) కొని ప్లేట్లు తయారు చేసి అమ్మితే.. ఖర్చులు పోను కిలోపై రూ.15-20 లాభం మిగులుతుంది.
మార్కెటింగ్: మీ ఊర్లో ఉన్న కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లతో మాట్లాడితే చాలు.. స్టాక్ మొత్తం అమ్ముడుపోతుంది.
మహిళలు ఇంటి పని చేసుకుంటూనే.. ఖాళీ సమయాల్లో ఈ మెషీన్ ఆపరేట్ చేస్తూ చక్కటి ఆదాయం పొందవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


