Gold Investment:బంగారం కొనాలా? షాపుకెళ్తే నష్టపోతారు.. ప్రభుత్వమే చౌకగా ఇస్తోంది! (SGB Scheme).. బంగారం రేటు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతోంది. ఇప్పుడు బంగారం కొనాలంటే సామాన్యుడికి తడిసి మోపెడవుతోంది.
పైగా తరుగు, మజూరీ పేరుతో జువెలరీ షాపులు బాదేస్తున్నాయి. కానీ తరుగు లేదు, మజూరీ లేదు.. పైగా మార్కెట్ కంటే తక్కువ రేటుకే కేంద్ర ప్రభుత్వం బంగారం ఇస్తోంది. అదే సావరీన్ గోల్డ్
బాండ్ (SGB) స్కీమ్.
డిస్కౌంట్: ఆన్‌లైన్‌లో ఈ బాండ్లు కొంటే గ్రాముకు రూ.50 తగ్గుతుంది.
వడ్డీ: మీరు పెట్టిన పెట్టుబడికి ఏటా 2.5% వడ్డీ అదనంగా మీ బ్యాంక్ ఖాతాలో పడుతుంది. బయట బంగారం కొంటే వడ్డీ రాదు కదా!
పన్ను లేదు: 8 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ తీరినప్పుడు వచ్చే లాభంపై ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు.
భద్రత: ఇది పేపర్ రూపంలో (Digital Gold) ఉంటుంది కాబట్టి దొంగతనం భయం లేదు.
మీ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఈ బాండ్ల గురించి ఆరా తీయండి. బంగారంపై పెట్టుబడికి ఇంతకంటే మంచి మార్గం లేదు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


