Phone Hacking Prevention Tips:మీ ఫోన్ హ్యాక్ అయిందా? ఎవరైనా మీ కాల్స్ వింటున్నారా? ఈ చిన్న కోడ్‌తో వెంటనే చెక్ చేసుకోండి!
మన స్మార్ట్‌ఫోన్‌లోనే మన బ్యాంక్ అకౌంట్స్, పర్సనల్ ఫోటోలు, వాట్సాప్ చాట్స్ అన్నీ ఉంటున్నాయి. ఇది తెలిసిన సైబర్ నేరగాళ్లు మన ప్రమేయం లేకుండానే ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు.
అయితే, వాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేయడానికి పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్‌లు వాడట్లేదు.. కేవలం 'కాల్ ఫార్వార్డింగ్' అనే చిన్న ట్రిక్ ద్వారా మీ ఓటీపీలు (OTPs) దొంగిలిస్తున్నారు! అసలు మీ ఫోన్ సేఫ్‌గా ఉందో లేదో 2 సెకన్లలో ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.
అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?
"మీ కొరియర్ వచ్చింది, అడ్రస్ దొరకట్లేదు ఈ నంబర్‌కు కాల్ చేయండి" అని డెలివరీ బాయ్ పేరుతో మీకు ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఉన్న నంబర్‌ను మీరు నొక్కి కాల్ చేయగానే.. మీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు అన్నీ హ్యాకర్ నంబర్‌కు ఫార్వార్డ్ (Forward) అయిపోతాయి. ఇక మీ బ్యాంక్ ఓటీపీలు, వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్స్ అన్నీ వాళ్ల చేతికి వెళ్లిపోతాయి.
మీ ఫోన్ సేఫ్‌గా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి:
ఇది తెలుసుకోవడం చాలా సింపుల్. మీ మొబైల్ డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఈ కింది కోడ్ ఎంటర్ చేయండి:
డయల్ చేయాల్సిన కోడ్: *#21#
దీన్ని డయల్ చేయగానే మీ స్క్రీన్ మీద Call Forwarding, SMS, Voice.. ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అవన్నీ 'Not Forwarded' లేదా 'Disabled' అని ఉంటే మీ ఫోన్ పూర్తిగా సేఫ్. ఒకవేళ అందులో ఏ ఒక్కటి 'Enabled' అని ఉన్నా.. మీ ఫోన్ హ్యాక్ అయినట్లే! మీ కాల్స్ అన్నీ సైబర్ క్రిమినల్స్‌కి వెళ్తున్నట్లే.
ఒకవేళ హ్యాక్ అయితే ఏం చేయాలి?
ఏమాత్రం టెన్షన్ పడకండి! ఒకవేళ మీ కాల్స్ వేరే నంబర్‌కు ఫార్వార్డ్ అవుతున్నట్లు గుర్తిస్తే.. వెంటనే ఈ కింది కోడ్ డయల్ చేయండి:
ఫార్వార్డింగ్ క్యాన్సిల్ చేసే కోడ్: ##002#
ఈ కోడ్ డయల్ చేసిన కొన్ని సెకన్లలోనే మీ ఫోన్‌లోని ఫార్వార్డింగ్ ఆప్షన్స్ అన్నీ ఆటోమెటిక్‌గా డిసేబుల్ అయిపోతాయి. హ్యాకర్ల కనెక్షన్ కట్ అయిపోతుంది. మీ వాట్సాప్ కూడా లాగ్ అవుట్ అయితే మళ్లీ లాగిన్ అవ్వండి.
ఈ చిన్న టెక్నిక్‌తో 80% సైబర్ మోసాలను అరికట్టవచ్చు. కాబట్టి ఈ రోజే మీ ఫోన్‌లో, మీ కుటుంబ సభ్యుల ఫోన్లలో ఈ కోడ్ డయల్ చేసి చెక్ చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


