Ranapala:మీ ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు.. డాక్టర్ అవసరమే ఉండదని మీకు తెలుసా?

Ranapala
Ranapala:మీ ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు.. డాక్టర్ అవసరమే ఉండదని మీకు తెలుసా? ఆయుర్వేదంలో 'సంజీవిని'గా పిలువబడే ఆ మొక్కే 'రణపాల' (Leaf of Life). కిడ్నీలో రాళ్ల నుండి షుగర్ వ్యాధి వరకు.. ఇది దాదాపు 100 రకాల రోగాలకు చెక్ పెడుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత ఆకు ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

అసలేంటి ఈ రణపాల? ఎందుకంత పవర్? శాస్త్రీయంగా బ్రయోఫిల్లం (Bryophyllum) అని పిలిచే ఈ మొక్కకు ఒక ప్రత్యేకత ఉంది. దీని ఆకును మట్టిలో వేస్తే చాలు, ఆకు అంచుల నుండే కొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. అందుకే దీనిని 'లీఫ్ ఆఫ్ లైఫ్' అని, తెలుగులో రణపాల అని పిలుస్తారు. నీళ్లు పోయకపోయినా 15 రోజుల పాటు వాడిపోకుండా ఉండే శక్తి దీని సొంతం.

రణపాల ఆకుతో తగ్గే ప్రధాన సమస్యలు ఇవే: ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఈ ఆకు దాదాపు 30-40 దీర్ఘకాలిక వ్యాధులకు, మొత్తంగా 100 రకాల అనారోగ్యాలకు ఏకైక పరిష్కారం.

కిడ్నీలో రాళ్లకు బ్రహ్మాస్త్రం: రణపాల ఆకు కషాయం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోవడమే కాదు, మూత్రాశయంలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి.

రక్త శుద్ధికి: రణపాల ఆకుపై కాస్త ఉప్పు రాసి నమిలితే చాలు.. రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను పదిలంగా ఉంచుతుంది.

గ్యాస్ట్రిక్ సమస్యలకు: ఈ ఆకులను జ్యూస్‌లా చేసుకుని తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్లు దరిచేరవు. కడుపులో మంట తగ్గుతుంది.

గాయాలు & చర్మ సమస్యలు: వేడి పొక్కులు, గాయాలైన చోట రణపాల ఆకును మెత్తగా నూరి రాస్తే.. కేవలం రెండు రోజుల్లోనే మానిపోతాయి.

మధుమేహం & బీపీ: షుగర్, బీపీ నియంత్రణలోనూ ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది.

ఇంట్లోనే పెంచుకోవచ్చు: ఇది ఎడారి మొక్క జాతికి చెందింది కాబట్టి, పెద్దగా నీరు అవసరం లేదు. ఎలాంటి నేలలోనైనా బతుకుతుంది. కుండీలో ఒక్క ఆకు వేసినా బతికేస్తుంది. ప్రతీ ఒక్కరూ తమ పెరట్లో తప్పక పెంచుకోవాల్సిన మొక్క ఇది.

గమనిక: రణపాల ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ, దీనిని ఔషధంగా వాడే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయుర్వేద నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top