Soya Chunks with Brown Rice: చికెన్, మటన్ తినకపోయినా అంతకుమించిన ప్రొటీన్.. బరువు తగ్గించే 'సోయా చంక్స్ - బ్రౌన్ రైస్'!

Soya Chunks with Brown Rice
Soya Chunks with Brown Rice: చికెన్, మటన్ తినకపోయినా అంతకుమించిన ప్రొటీన్.. బరువు తగ్గించే 'సోయా చంక్స్ - బ్రౌన్ రైస్'..

నాన్-వెజ్ తినని వారికి సోయా చంక్స్ (మీల్ మేకర్) బెస్ట్ ప్రొటీన్ సోర్స్. చికెన్‌తో సమానమైన ప్రొటీన్ ఇందులో ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు: సోయా చంక్స్ (మీల్ మేకర్) - 1 కప్పు, ఉల్లిపాయ, టమాటా ప్యూరీ - 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, బ్రౌన్ రైస్ - అర కప్పు.

తయారీ విధానం:సోయా చంక్స్‌ను వేడి నీళ్లలో 10 నిమిషాలు ఉంచి, గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి, టమాటా ప్యూరీ వేసి పచ్చివాసన పోయేలా ఉడికించాలి.

ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలుపుకున్నాక, సోయా చంక్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవాలి. బ్రౌన్ రైస్‌ను మామూలు అన్నంలాగే వండుకోవాలి (కానీ కొద్దిగా ఎక్కువ నీళ్లు, ఎక్కువ సమయం పడుతుంది).

ప్రయోజనాలు: కండరాలు దృఢంగా మారడానికి, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి సోయా చంక్స్ బాగా ఉపయోగపడతాయి. బ్రౌన్ రైస్ వల్ల మెటబాలిజం పెరుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top