Wi-Fi Tips:రాత్రిపూట మీ ఇంట్లో 'Wi-Fi' ఆన్ చేసి పడుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే!

Wifi tips
Wi-Fi Tips:రాత్రిపూట మీ ఇంట్లో 'Wi-Fi' ఆన్ చేసి పడుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే!

ఈ రోజుల్లో ఇంట్లో టీవీ ఆఫ్‌లో ఉంటుందేమో కానీ, వై-ఫై (Wi-Fi) రూటర్ మాత్రం 24 గంటలూ ఆన్‌లోనే ఉంటుంది. ఫోన్ వాడినా వాడకపోయినా, కనీసం రాత్రి పడుకునేటప్పుడు కూడా చాలామంది దాన్ని స్విచ్ ఆఫ్ చేయరు.

కానీ, రాత్రిపూట అవసరం లేకపోయినా వై-ఫై ఆన్ చేసి ఉంచడం వల్ల మీ ఆరోగ్యానికి, అలాగే మీ జేబుకు కూడా ఎంత నష్టమో తెలిస్తే షాక్ అవుతారు. దాన్ని ఆఫ్ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

నిద్రను దూరం చేసే సిగ్నల్స్:
వై-ఫై రూటర్ దగ్గరగా పెట్టుకుని పడుకునే వారిలో దాదాపు 27 శాతం మంది 'నిద్రలేమి' (Insomnia) తో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. రాత్రివేళ ఈ రూటర్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మరియు రేడియేషన్ మన మెదడును ప్రశాంతంగా ఉండనివ్వవు. అందుకే నిద్ర సరిగ్గా పట్టక ఉదయం లేచేసరికి అలసటగా అనిపిస్తుంది.
 
రాత్రి పూట ఆఫ్ చేస్తే కలిగే లాభాలివే:
మెరుగైన నిద్ర: వై-ఫై ఆఫ్ చేయగానే నోటిఫికేషన్ల డిస్టర్బెన్స్ ఆగిపోయి, డిజిటల్ ప్రపంచం నుంచి మెదడుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడు ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పడుతుంది.

కరెంట్ & డేటా ఆదా: రాత్రంతా రూటర్ ఆన్‌లో ఉంటే అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ అప్‌డేట్స్ జరిగి డేటా అయిపోతుంది, అలాగే పవర్ కూడా వేస్ట్ అవుతుంది. ఆఫ్ చేయడం వల్ల కరెంట్ బిల్లు, డేటా రెండూ ఆదా అవుతాయి.

హ్యాకింగ్ ముప్పు తక్కువ: 24 గంటలు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండటం వల్ల సైబర్ క్రిమినల్స్ మీ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఎక్కువ. రాత్రి పూట ఆఫ్ చేస్తే ఆ ముప్పును చాలా వరకు తగ్గించవచ్చు.

రూటర్ లైఫ్ పెరుగుతుంది: నిరంతరం ఆన్‌లో ఉండటం వల్ల రూటర్ వేడెక్కి (Overheat) త్వరగా పాడవుతుంది. రాత్రి పూట దానికి రెస్ట్ ఇస్తే దాని లైఫ్‌స్పాన్ పెరుగుతుంది.

ఒక చిన్న సలహా: ఒకవేళ మీ ఇంట్లో సెక్యూరిటీ కెమెరాలు (CCTV) లాంటివి ఉండి, రాత్రి పూట వై-ఫై ఆపడం కుదరకపోతే.. కనీసం ఆ రూటర్‌ను మీరు పడుకునే బెడ్‌రూమ్‌లో కాకుండా, బయట హాల్‌లో ఉండేలా చూసుకోండి. దీనివల్ల రేడియేషన్ ప్రభావం మీ మీద తక్కువగా ఉంటుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top