Green Tea: గ్రీన్ టీలో 'ఇది' కలిపి తాగితే చాలు.. 30 రోజుల్లో 3 కిలోల బరువు తగ్గడం గ్యారెంటీ.. బరువు తగ్గాలని ప్రయత్నించే చాలామంది చేసే మొదటి పని.. ఉదయాన్నే చాయ్, కాఫీలు మానేసి 'గ్రీన్ టీ' (Green Tea) తాగడం. కానీ, కేవలం గ్రీన్ టీ తాగితే సరిపోదు..
దాన్ని సరైన సమయంలో, అందులో కొన్ని అద్భుతమైన పదార్థాలు కలిపి తాగితేనే నెల రోజుల్లో 3 నుంచి 4 కిలోల బరువు ఈజీగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఆ సీక్రెట్ ఏంటో, గ్రీన్ టీని ఎలా తాగాలో ఇక్కడ తెలుసుకుందాం..
గ్రీన్ టీ + నెయ్యి = ఫ్యాట్ కట్టర్!
గ్రీన్ టీలో అర టీస్పూన్ 'స్వచ్ఛమైన నెయ్యి' (Ghee) కలిపి తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ డబుల్ స్పీడ్‌తో జరుగుతుంది.
ఎందుకంటే?: గ్రీన్ టీలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను శరీరం పూర్తిగా గ్రహించాలంటే నెయ్యి చాలా అవసరం. నెయ్యిలో ఉండే 'బ్యూటైరేట్' అనే ఫ్యాటీ యాసిడ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, కొవ్వును వేగంగా కరిగిస్తుంది.
దాల్చిన చెక్క.. మరో బ్రహ్మాస్త్రం!
నెయ్యితో పాటు చిటికెడు దాల్చిన చెక్క (Cinnamon) పొడిని కూడా మీ గ్రీన్ టీలో కలుపుకోండి.
లాభాలు: ఇందులోని ఫ్లేవనాయిడ్స్ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడమే కాకుండా.. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.
గ్రీన్ టీ ఎప్పుడు? ఎలా తాగాలి?
బరువు తగ్గాలంటే మీరు కచ్చితంగా పాటించాల్సిన రూల్స్ ఇవే:
ఉదయం: నిద్ర లేచిన 30 నిమిషాల తర్వాత మొదటి కప్పు గ్రీన్ టీ తాగాలి. ఇది మీ మెటబాలిజంను వేగవంతం చేస్తుంది.
మధ్యాహ్నం: భోజనానికి (Lunch) అరగంట ముందు మరో కప్పు తాగితే.. ఒంట్లో పేరుకుపోయిన ఫ్యాట్ వేగంగా కట్ అవుతుంది.
నో షుగర్: గ్రీన్ టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చక్కెర (Sugar) కానీ, తేనె కానీ కలుపుకోకూడదు.
ఈ రెండు పనులు చేస్తే రిజల్ట్ పక్కా!
కేవలం గ్రీన్ టీ తాగేసి ఊరుకుంటే లాభం లేదు. దీనికి తోడు రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. అలాగే రాత్రి పూట వీలైనంత తక్కువ ఆహారం (Light Dinner) తీసుకుంటే.. గ్రీన్ టీ ప్రభావం రాత్రి కూడా కొనసాగి, మీ బరువు తగ్గే ప్రయాణం మరింత ఈజీ అవుతుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

