Pharmacy Business:ఫార్మసీ చదివారా? అయితే మీ దశ తిరిగినట్టే.. సొంత ఊర్లోనే రూ.లక్షలు సంపాదించే ఛాన్స్!
ఉద్యోగం కోసం పట్నం వెళ్లాల్సిన పనిలేదు.. ప్రభుత్వం ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ గురించి మీకు తెలుసా?
ఫార్మసీ (B.Pharmacy / D.Pharmacy) పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకోసం ఒక అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. సిటీలకు వెళ్లి అరకొర జీతాలకు పనిచేసే బదులు, మీ సొంత ఊర్లోనే దర్జాగా వ్యాపారం చేసుకుంటూ రూ.లక్షల్లో సంపాదించే సువర్ణావకాశం ఇది.
ఏంటి ఆ పథకం? ఆదాయం ఎలా వస్తుంది?
గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ ఎక్కువగా ఉంటుంది. కానీ పశువులకు సరైన మందులు టైమ్‌కి దొరకవు. ఈ సమస్యను తీర్చేందుకే ప్రభుత్వం 'పశు ఔషధి విక్రయ కేంద్రాల' (Pashu Aushadhi Vikraya Kendram) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మీరే స్వయంగా వెటర్నరీ ఫార్మసీని పెట్టుకోవచ్చు.
రైతులకు తక్కువ ధరకే మందులు, టీకాలు, సప్లిమెంట్లను అందించవచ్చు.
లాభం ఎంత ఉంటుంది?
ఈ బిజినెస్‌లో రిస్క్ చాలా తక్కువ.. లాభం ఎక్కువ!
20% ప్రాఫిట్: మీరు అమ్మే మందులపై సుమారు 20 శాతం వరకు లాభం (Margin) ఉంటుంది.
నో టెన్షన్: మందుల స్టాక్ కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ప్రభుత్వ సంస్థ 'పీఎంబీఐ' (PMBI) నుంచే నేరుగా మీకు నాణ్యమైన మందులు సరఫరా అవుతాయి.
గ్రామాల్లో పశువులు ఎక్కువ, మందుల షాపులు తక్కువ కాబట్టి గిరాకీకి ఢోకా ఉండదు.
ఎవరెవరు అర్హులు? (Eligibility)
ఖచ్చితంగా B.Pharmacy లేదా D.Pharmacy పూర్తి చేసి ఉండాలి.
ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో 'రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్' అయి ఉండాలి.
షాపు పెట్టడానికి సొంత ఊర్లో కనీసం 120 చదరపు అడుగుల స్థలం (సొంతది లేదా అద్దెదైనా పర్లేదు) ఉండాలి.
కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే:
ఫార్మాసిస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
డిగ్రీ/డిప్లొమా సర్టిఫికేట్
డ్రగ్ సేల్ లైసెన్స్
ఆధార్, అడ్రస్ ప్రూఫ్
షాపు స్థలానికి సంబంధించిన పత్రాలు
అప్లై చేసుకోవడం ఎలా?
ఆసక్తిగల యువత వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారిక వెబ్‌సైట్
pashuaushadhi.dahd.gov.in లో వివరాలు నమోదు చేసుకోవాలి. మీ డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయిన వెంటనే పర్మిషన్ లభిస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం? మీ ఊర్లోనే బాస్‌లా బ్రతికేయండి! ఈ సమాచారం మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


