IRCTC Char Dham Yatra:జీవితంలో ఒక్కసారైనా చార్‌ధామ్ వెళ్లాలనుకుంటున్నారా? ఏపీ భక్తులకు IRCTC బంపర్ ఆఫర్.. ప్యాకేజీ వివరాలివే!

IRCTC Char Dham Yatra
IRCTC Char Dham Yatra:జీవితంలో ఒక్కసారైనా చార్‌ధామ్ వెళ్లాలనుకుంటున్నారా? ఏపీ భక్తులకు IRCTC బంపర్ ఆఫర్.. ప్యాకేజీ వివరాలివే!

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే 'చార్‌ధామ్ యాత్ర' (Char Dham Yatra) కు వెళ్లడం చాలామంది కల. కానీ అక్కడి వాతావరణం, ప్రయాణం, బస లాంటివి ఎలా ఉంటాయోనని చాలామంది టెన్షన్ పడుతుంటారు. 

అలాంటి వారి కోసం.. ఎలాంటి రిస్క్ లేకుండా, అన్నీ దగ్గరుండి చూసుకునేలా ఇండియన్ రైల్వేస్ (IRCTC) ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.

మరీ ముఖ్యంగా ఏపీ భక్తుల సౌకర్యార్థం విశాఖపట్నం నుంచి విమాన ప్రయాణంతో ఈ 12 రోజుల ప్యాకేజీని డిజైన్ చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం..

ప్యాకేజీ హైలైట్స్ ఇవే:
యాత్ర వ్యవధి: 11 రాత్రులు, 12 రోజులు
ప్రయాణం: విశాఖపట్నం నుంచి డెహ్రాడూన్ (ఫ్లైట్ ద్వారా)
తేదీలు: జూన్ 12న ప్రారంభమై, జూన్ 23న ముగుస్తుంది.

కవర్ అయ్యే పుణ్యక్షేత్రాలు: బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రితో పాటు బార్కోట్, గుప్తకాశి, హరిద్వార్, సోన్‌ప్రయాగ్.

యాత్ర సాగుతుందిలా (షార్ట్ షెడ్యూల్):
డే 1: విశాఖలో ఫ్లైట్ ఎక్కి డెహ్రాడూన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హరిద్వార్‌ వెళ్లి గంగా హారతిలో పాల్గొంటారు.

డే 2 & 3: బార్కోట్ చేరుకుని, జానకి చట్టి నుంచి ట్రెక్కింగ్ ద్వారా యమునోత్రి దర్శనం చేసుకుంటారు.

డే 4 & 5: ఉత్తరకాశిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం, ఆ తర్వాత గంగోత్రి ఆలయంలో గంగాదేవి దర్శనం, పూజలు ఉంటాయి.

డే 6, 7 & 8: గుప్తకాశి మీదుగా గౌరీకుండ్ చేరుకుని, అక్కడి నుంచి 16 కి.మీ ట్రెక్కింగ్ ద్వారా కేదార్‌నాథ్ చేరుకుంటారు. స్వామివారి అభిషేక దర్శనం పూర్తి చేసుకుని తిరిగి సోన్‌ప్రయాగ్ వస్తారు.

డే 9 & 10: జోషిమఠ్ మీదుగా బద్రీనాథ్ ప్రయాణం. స్వామివారి ఆరతి, తర్పణాలు ఉంటాయి. ఇండో–టిబెట్ సరిహద్దులో ఉన్న భారతదేశపు చివరి గ్రామం 'మానా'ను సందర్శిస్తారు.

డే 11 & 12: రుద్రప్రయాగ్, హరిద్వార్ మీదుగా తిరిగి డెహ్రాడూన్ చేరుకుని.. ఫ్లైట్ ఎక్కి విశాఖపట్నం చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీ ధరల వివరాలు (ఒక్కొక్కరికి):
సింగిల్ షేరింగ్ (ఒక్కరే ఉంటే): ₹98,765
డబుల్ షేరింగ్ (ఇద్దరు ఉంటే): ₹87,510
ట్రపుల్ షేరింగ్ (ముగ్గురు ఉంటే): ₹83,010
పిల్లలకు (బెడ్ కావాలంటే): ₹54,495 (బెడ్ వద్దు అనుకుంటే ₹42,585).

వసతి, భోజనం, ఫ్లైట్ టికెట్లు, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ అన్నీ ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి. ఆసక్తి ఉన్న భక్తులు IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్
www.irctctourism.com లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top