Orange Peel:నారింజ తిని తొక్క పారేస్తున్నారా? ఈ మ్యాజిక్ తెలిస్తే ఇకపై ఆ తప్పు అస్సలు చేయరు!
సాధారణంగా మనం నారింజ పండును తిని, దాని తొక్కలను చెత్తబుట్టలో వేసేస్తుంటాం. కానీ ప్రముఖ హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. పండులో ఎన్ని పోషకాలు ఉంటాయో, ఆ తొక్కలో కూడా అంతే స్థాయిలో ఫైబర్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు దాగి ఉంటాయి. చర్మ సౌందర్యానికే కాకుండా.. ఆరోగ్యం, ఇంటి అవసరాలకు ఈ తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. అదెలాగో ఇక్కడ చూద్దాం..
నారింజ తొక్కలతో అద్భుతమైన ఉపయోగాలు ఇవే:
వంటలకు సూపర్ టేస్ట్: కేకులు, పేస్ట్రీలు, డెజర్ట్‌లు చేసేటప్పుడు నారింజ తొక్కను కొద్దిగా తురిమి వేయండి. ఆ వంటకాల రుచి, సువాసన అమాంతం పెరిగిపోతాయి. (మరీ ఘాటు రాకుండా కొంచెమే వాడాలి).
హెల్తీ 'ఆరెంజ్ పీల్' టీ: మీరు రోజూ తాగే బ్లాక్ టీలో రెండు చిన్న నారింజ తొక్క ముక్కలు వేసి మరిగించి చూడండి. ఆ టీ సువాసన మిమ్మల్ని రోజంతా రిలాక్స్‌గా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.
న్యాచురల్ రూమ్ ఫ్రెషనర్: కెమికల్స్ ఉండే రూమ్ ఫ్రెషనర్లు వాడే బదులు.. నారింజ తొక్కలు, 5-6 లవంగాలను నీటిలో మరిగించి స్ప్రే బాటిల్‌లో నింపండి. దీన్ని ఇంట్లో స్ప్రే చేస్తే ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఎండబెట్టిన తొక్కలను బట్టల మధ్యలో పెడితే దుస్తులు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి.
తలనొప్పికి చెక్: వేసవిలో వచ్చే తలనొప్పి లేదా స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పికి నారింజ తొక్కల సువాసన బెస్ట్ మెడిసిన్. ఒక చిన్న ముక్కను వాసన చూసినా లేదా అరోమాథెరపీలో వాడినా తక్షణ ఉపశమనం లభిస్తుంది.
మొక్కలకు బెస్ట్ ఎరువు: మీ ఇంట్లో పెంచే మొక్కలకు ఈ తొక్కలు కంపోస్ట్‌లా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ద్రవ ఎరువుగా (Liquid fertilizer) మార్చి మొక్కలకు పోస్తే తెగుళ్ల బెడద కూడా ఉండదు.
ఇకపై నారింజ తొక్కలను పారేయకుండా ఇలా తెలివిగా వాడుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

