ప్రస్తుత రోజుల్లో వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం, చుండ్రు (Dandruff) అనేవి అతి సాధారణ సమస్యలుగా మారిపోయాయి. మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా పెద్దగా ఫలితం ఉండటం లేదు కదూ!
అయితే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
అవిసె గింజలు (Flaxseeds): 2 స్పూన్లు
కలబంద గుజ్జు (Aloe Vera Gel): తగినంత (ఇంట్లో పెంచే మొక్క నుంచి తీసిన తాజా జెల్ అయితే మరింత మంచిది. లేదంటే మార్కెట్లో దొరికే జెల్ వాడవచ్చు).
ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి, అందులో రెండు స్పూన్ల అవిసె గింజలు వేయాలి.సన్నని మంట మీద సుమారు 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి.గింజలు ఉడికి, నీరు కాస్త చిక్కబడి జెల్ లాగా మారుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ జెల్‌ను వేడిగా ఉన్నప్పుడే ఒక పల్చటి వస్త్రం లేదా స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి.ఇప్పుడు ఈ అవిసె గింజల జెల్‌లో తగినంత ఆలోవెరా జెల్ వేసి, రెండూ బాగా కలిసేలా మిక్స్ చేయాలి. అంతే, పవర్ ఫుల్ నాచురల్ హెయిర్ ప్యాక్ రెడీ!
ఎలా వాడాలి?
తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని తల కుదుళ్ల నుండి వెంట్రుకల చివర్ల వరకు బాగా పట్టించాలి.
కుదుళ్లకు అంటేలా సున్నితంగా మసాజ్ చేసి, కనీసం ఒక అరగంట (30 నిమిషాలు) పాటు అలాగే వదిలేయాలి.
ఆ తర్వాత మీరు రెగ్యులర్‌గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవిసె గింజల్లోని పోషకాలు, ఆలోవెరాలోని మాయిశ్చరైజింగ్ గుణాలు తల మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి. కేవలం 7 రోజుల్లోనే జుట్టు రాలే సమస్య, చుండ్రు తగ్గిపోయి, మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం మీరే గమనిస్తారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

