ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే.. పొట్ట కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాల్సిందే!

Chia seeds weight loss drink
మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్స్, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది అధిక బరువు, చెడు కొలెస్ట్రాల్, నీరసం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. 

రోజంతా ఎలాంటి నొప్పులు, అలసట లేకుండా యాక్టివ్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, మన ఇంట్లో ఉండే వాటితోనే తయారుచేసుకునే ఒక సింపుల్ డ్రింక్ ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతుంది. అదేంటో, ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

మ్యాజిక్ డ్రింక్ తయారీ విధానం:
ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ చియా విత్తనాలు వేసి అరగంట పాటు వదిలేయాలి. అప్పుడు అవి ఉబ్బి జెల్లీలా మారుతాయి.

ఇప్పుడు అందులో ఒక స్పూన్ తేనె, అర చెక్క నిమ్మరసం, 6 లేదా 7 పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి.

ఒక 15 నిమిషాల పాటు ఫ్లేవర్స్ నీటిలో కలిసేలా వదిలేయాలి. ఆ తర్వాత తాగాలి. వాతావరణం వేడిగా ఉంటే, కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని తాగవచ్చు.

ఈ డ్రింక్ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:
బరువు తగ్గుతారు: చియా విత్తనాల్లో ఉండే ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును వేగంగా కరిగిస్తాయి.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్: పుదీనా, నిమ్మరసం కలయిక రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

నీరసం, అలసట మాయం: నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి రోజంతా మిమ్మల్ని హుషారుగా, ఎనర్జిటిక్ గా ఉంచుతాయి.

కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం: వయసుతో సంబంధం లేకుండా వేధించే కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ డ్రింక్ మంచి రిలీఫ్ ఇస్తుంది.

పోషకాల గని: చియా విత్తనాలలో క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, విటమిన్ బి1, బి2, బి3 వంటి ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి.

ముఖ్య గమనిక: డయాబెటిస్ (షుగర్ వ్యాధి) ఉన్నవారు మాత్రం ఈ డ్రింక్‌ను తేనె లేకుండా తీసుకోవాలి. ఈ డ్రింక్ రోజూ తాగవచ్చు లేదా రోజు విడిచి రోజు తాగవచ్చు. ఈ సీజన్‌లో తాగితే ఎలాంటి సీజనల్ సమస్యలు దరిచేరవు!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'chaipakodi' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top