వాట్సాప్ లో ఎవరైనా మెసేజ్ పంపి వెంటనే డిలీట్ చేశారా? ఎలాంటి థర్డ్-పార్టీ యాప్ లేకుండానే ఆ మెసేజ్‌లను ఇలా చదివేయండి!

How to read deleted WhatsApp messages in Telugu
మనం వాట్సాప్ (WhatsApp) చూసుకునే లోపే.. ఎవరైనా మనకు మెసేజ్ పంపి వెంటనే 'Delete for Everyone' కొట్టేస్తుంటారు. అలాంటప్పుడు ఆ మెసేజ్‌లో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి (క్యూరియాసిటీ) అందరికీ ఉంటుంది. 

దీనికోసం చాలామంది రకరకాల థర్డ్-పార్టీ యాప్స్ ఎక్కించి ఫోన్ డేటాను రిస్క్‌లో పెడుతుంటారు. కానీ, ఎలాంటి యాప్స్ అవసరం లేకుండానే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే ఒక చిన్న సెట్టింగ్ ఆన్ చేసుకుంటే చాలు.. డిలీట్ అయిన మెసేజ్‌లను ఈజీగా చదివేయొచ్చు.

డిలీట్ అయిన మెసేజ్‌లను చదివే సీక్రెట్ సెట్టింగ్:
ముందుగా మీ మొబైల్‌లోని Settings (సెట్టింగ్స్) ఓపెన్ చేయండి.అందులో Notifications (నోటిఫికేషన్స్) అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

అక్కడ మీకు Notification History (నోటిఫికేషన్ హిస్టరీ) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
బై డీఫాల్ట్‌గా అది ఆఫ్ (Off) చేసి ఉంటుంది. మీరు దాన్ని ఆన్ (On) చేసుకోండి. అంతే!

ఎలా పనిచేస్తుంది? ఈ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత.. మీకు ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్ పంపి డిలీట్ చేసినా సరే, మీరు నేరుగా ఫోన్ సెట్టింగ్స్‌లోని 'Notification History' లోకి వెళ్లి చూస్తే.. ఆ డిలీట్ చేసిన మెసేజ్ అక్కడ టైమ్‌తో సహా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ట్రిక్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు (Android 11 ఆపైన ఉన్న వెర్షన్లకు) మాత్రమే పనిచేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top