నీటి కాలుష్యం, ఒత్తిడి, మరియు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది హెయిర్ ఫాల్ (జుట్టు రాలడం) సమస్యతో బాధపడుతున్నారు.
మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన షాంపూలు వాడి జుట్టును మరింత పాడుచేసుకుంటున్నారు. అయితే, మన ఇంట్లోనే ఒక ఆయుర్వేద నూనెను తయారు చేసుకుంటే జుట్టు రాలడం ఆగిపోయి, కుదుళ్లు బలంగా మారుతాయి.
హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారీ విధానం:
ఒక మందపాటి గిన్నెలో పావు లీటరు స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకోవాలి.దీన్ని స్టవ్ మీద పెట్టి సన్నటి మంటపై వేడి చేస్తూ.. అందులో గుప్పెడు కడిగిన కరివేపాకులు, 2 మందార పూలు, మరియు ఒక స్పూన్ మెంతులు వేయాలి.
ఆకులు పూర్తిగా రంగు మారి నల్లగా అయ్యేవరకు (సుమారు 10 నిమిషాలు) నూనెను మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, నూనె పూర్తిగా చల్లారాక వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఎలా వాడాలి?
రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి, జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి మసాజ్ చేయాలి. ఉదయం లేచాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. కరివేపాకు, మెంతులలో ఉన్న ప్రోటీన్స్ వల్ల జుట్టు రాలడం తగ్గిపోయి చాలా ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

