మండుతున్న ఎండలకు చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుందా? బయట దొరికే కెమికల్స్ నిండిన కూల్ డ్రింక్స్ కు బదులు, కేవలం 5 రూపాయల ఖర్చుతో ఇంట్లోనే ఓ అద్భుతమైన ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. అదేంటో కాదు.. మన వంటగదిలో ఎప్పుడూ ఉండే పుదీనా!
పుదీనా ఆకులను మిక్సీ పట్టి, అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు లేదా తేనె కలుపుకుని ఐస్ వేసుకుని తాగితే.. ఆ మజాయే వేరు. ఇది కేవలం రుచికే కాదు.. మన శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. ఇంతకీ పుదీనాతో ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు!
పుదీనాతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:
జీర్ణక్రియకు దివ్యౌషధం: కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నారా? పుదీనాలో ఉండే ‘మెంథాల్’ కడుపులోని కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఒక కప్పు పుదీనా టీ లేదా జ్యూస్ తాగితే ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), అజీర్ణం నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
జలుబు, దగ్గుకు చెక్: శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు పుదీనా ఆవిరి పడితే.. ముక్కు బ్లాక్ ఓపెన్ అవుతుంది. ఊపిరితిత్తులు, గొంతు మంటను తగ్గించి శ్వాస సులభంగా ఆడేలా చేస్తుంది.
తలనొప్పి, ఒళ్లు నొప్పులు పరార్: ఎండల వల్ల వచ్చే తలనొప్పికి పుదీనా టీ బెస్ట్ మెడిసిన్. అలాగే కీళ్ల నొప్పులు లేదా కండరాల నొప్పులు ఉన్నచోట పుదీనా ఆకుల పేస్ట్ రాస్తే నొప్పి ఇట్టే మాయం అవుతుంది.
మైండ్ బ్లోయింగ్ ఫ్రెష్‌నెస్: పుదీనా సువాసన ఒత్తిడి, అలసటను ఇట్టే దూరం చేస్తుంది. దీన్ని సహజ ‘మౌత్ ఫ్రెషనర్’ గా వాడొచ్చు. ఇది నోటి దుర్వాసనను పోగొట్టి, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
కడుపులో పురుగులకు చెక్: పుదీనా రసంలో కొద్దిగా తేనె, ఉప్పు కలుపుకుని పరగడుపున తాగితే కడుపులోని కృములు (నులిపురుగులు) చనిపోతాయి. బాడీ లోపల నుండి క్లీన్ అవుతుంది.
చివరి మాట: చూశారుగా.. ఐదు రూపాయల పుదీనా కట్టలో ఎన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయో! ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్ లో మీ డైలీ డైట్ లో పుదీనాను చేర్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

