మధ్యతరగతి కుటుంబానికి ‘సూపర్ మార్కెట్’ అంటే గుర్తొచ్చే మొదటి పేరు డీమార్ట్ (DMart). పక్కింటి కిరాణా కొట్టును వదిలేసి మరీ జనం ఇక్కడికి క్యూ కడుతుంటారు. మరి ఇతర బ్రాండ్ల కంటే డీమార్ట్ అంత తక్కువ ధరకే వస్తువులను ఎలా ఇవ్వగలుగుతోంది? ముఖేష్ అంబానీ వంటి దిగ్గజాలకు సైతం గట్టి పోటీ ఇస్తున్న రాధాకిషన్ దమానీ బిజినెస్ మోడల్ వెనుక ఉన్న అసలు గుట్టు ఏంటో తెలుసా?
1. సొంత బ్రాండ్ల 'పవర్'.. అడ్వర్టైజ్‌మెంట్లకు చెక్!
డీమార్ట్ సక్సెస్‌లో అసలైన కిటుకు వారి ‘ప్రైవేట్ లేబుల్స్’. పప్పులు, బియ్యం, నూనెలు, క్లీనింగ్ లిక్విడ్స్ వంటి నిత్యావసరాలను డీమార్ట్ తన సొంత బ్రాండ్ పేరుతో విక్రయిస్తుంది.
సీక్రెట్: పేరున్న కంపెనీలు ప్రకటనల కోసం కోట్లు ఖర్చు చేస్తాయి, కానీ డీమార్ట్ రూపాయి కూడా ఖర్చు చేయదు. ఆ మిగిలిన సొమ్మును వినియోగదారులకు 20% నుండి 40% వరకు డిస్కౌంట్ రూపంలో అందిస్తుంది.
2. బట్టల మార్కెట్‌లోనూ అదే వ్యూహం
కేవలం పప్పులు, ఉప్పులే కాదు.. దుస్తుల విభాగంలోనూ డీమార్ట్ తనదైన ముద్ర వేసింది. “ప్రీమియం” అనే బ్రాండ్ పేరుతో సొంత కలెక్షన్లను ఉంచుతుంది. పెద్ద పెద్ద షోరూమ్‌లలో వేల రూపాయలు ఉండే దుస్తుల నాణ్యతను తక్కువ ధరకే సామాన్యులకు చేరువ చేస్తోంది.
3. భారీ కొనుగోళ్లు.. నేరుగా తయారీదారుల నుంచే!
డీమార్ట్ ఏ వస్తువును కొన్నా టన్నుల కొద్దీ, భారీ పరిమాణంలో కొంటుంది. మధ్యలో దళారులు లేకుండా నేరుగా తయారీదారుల (Manufacturers) నుంచే స్టాక్ సేకరిస్తుంది. ఇలా బల్క్ పర్చేసింగ్ చేయడం వల్ల కంపెనీలకు భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. ఆ లాభాన్ని నేరుగా కస్టమర్ల జేబుకే చేరుస్తుంది డీమార్ట్.
4. ఖర్చు తగ్గించే తెలివైన పద్ధతులు
చాలా సూపర్ మార్కెట్లు తళతళలాడే డెకరేషన్లు, ఏసీలు, భారీ హోర్డింగ్‌ల కోసం లక్షలు ఖర్చు చేస్తాయి. కానీ డీమార్ట్ స్టోర్లు చాలా నిరాడంబరంగా ఉంటాయి.
సొంత భవనాలు: చాలా చోట్ల డీమార్ట్‌కు సొంత స్థలాలు, భవనాలు ఉన్నాయి. దీనివల్ల ప్రతి నెలా చెల్లించాల్సిన భారీ అద్దె భారం తప్పుతుంది. ఈ ఆదానే మనకు లభించే డిస్కౌంట్!
5. సప్లయర్లకు 'ఫాస్ట్ పేమెంట్'.. అందుకే స్పెషల్ డిస్కౌంట్!
సాధారణంగా రిటైల్ మార్కెట్‌లో సప్లయర్లకు డబ్బులు అందడానికి నెలల సమయం పడుతుంది. కానీ డీమార్ట్ తన సప్లయర్లకు అతి త్వరగా పేమెంట్స్ చేస్తుంది.
లాభం: త్వరగా డబ్బులు వస్తాయి కాబట్టి, సప్లయర్లు డీమార్ట్‌కు మరిన్ని ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తారు.
స్లాట్ ఫీజు: తమ షెల్ఫ్స్‌లో వస్తువులను ప్రదర్శించడానికి కంపెనీల నుండి ‘స్లాట్ ఫీజు’ కూడా వసూలు చేస్తుంది.
బాటమ్ లైన్: తక్కువ లాభం.. ఎక్కువ అమ్మకాలు (Low Margin, High Volume). ఇదే డీమార్ట్ సక్సెస్ మంత్రం. అందుకే సామాన్యుడికి ఇది ఎప్పటికీ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

