మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా? ఈ సింపుల్ చిట్కాతో 3 రోజుల్లో చెక్ పెట్టండి!

atural home remedy drink for urine infection, UTI, and body heat reduction in Telugu
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మూత్రంలో మంట మరియు యూరిన్ ఇన్ఫెక్షన్ (UTI). బిజీ లైఫ్‌స్టైల్ వల్ల నీళ్లు సరిగ్గా తాగకపోవడం, శరీరంలో లవణాల గాఢత పెరిగిపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతాయి. దీన్ని అశ్రద్ధ చేస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

అయితే, డాక్టర్ సూచనలు పాటిస్తూనే, మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతో ఈ సమస్యను చాలా త్వరగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

యూరిన్ ఇన్ఫెక్షన్ (UTI) ప్రధాన లక్షణాలు ఇవే:
పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, మంట.
మూత్రం రంగు మారడం.
పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కాస్త ఓపికగా ఈ కింది ఇంటి చిట్కాను ఫాలో అయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది.

మ్యాజిక్ డ్రింక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
నీళ్లు - 1 గ్లాసు
ధనియాల పొడి - 1 స్పూన్
పటికబెల్లం - 1 స్పూన్
ఉప్పు - పావు స్పూన్

తయారీ మరియు వాడే విధానం:
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ నీళ్లు పోయాలి.ఆ నీటిలో ధనియాల పొడి, పటికబెల్లం, ఉప్పు వేసి బాగా కలపాలి.సుమారు 7 నిమిషాల పాటు సన్నని మంటపై బాగా మరిగించాలి.

ఆ తర్వాత ఈ నీటిని వడకట్టుకోవాలి.ఇలా తయారుచేసుకున్న డ్రింక్‌ను ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగాలి.

ఈ డ్రింక్ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:
కేవలం 3 రోజుల్లోనే యూరిన్ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట పూర్తిగా తగ్గుముఖం పడతాయి.

ఆయుర్వేదంలో ఎక్కువగా వాడే ధనియాలు మరియు పటికబెల్లం.. శరీరంలోని అధిక వేడిని వెంటనే తగ్గిస్తాయి.

కిడ్నీలో ఏర్పడిన చిన్న చిన్న రాళ్లు సైతం కరిగిపోయే అవకాశం ఉంది.

ముఖ్య గమనిక: ఈ చిట్కాతో పాటు రోజూ తగినన్ని మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. మీ రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు ఉండేలా చూసుకోవాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top