Brown vs White Eggs: బ్రౌన్ గుడ్లు ఎందుకు అంత కాస్ట్‌లీ? వాటిలో నిజంగానే పోషకాలు ఎక్కువగా ఉంటాయా?

white egg and brown egg
సండే అయినా.. మండే అయినా.. రోజూ తినాలి అండే! డాక్టర్లు కూడా ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డు తినమని సలహా ఇస్తుంటారు. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, మనం సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు సాధారణంగా రెండు రకాల గుడ్లు కనిపిస్తాయి. ఒకటి మనం రెగ్యులర్‌గా వాడే తెల్ల గుడ్డు (White Egg), రెండోది కొద్దిగా ఎక్కువ ధర ఉండే బ్రౌన్ గుడ్డు (Brown Egg).

చాలామంది బ్రౌన్ కలర్‌లో ఉండే గుడ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే వాటికి అంత ధర ఉంటుందని భావిస్తారు. మరి ఇందులో నిజమెంత? ఈ రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది? ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్ల రంగు ఎందుకు మారుతుంది? గుడ్డు రంగు అనేది అందులో ఉండే పోషకాల మీద ఆధారపడి ఉండదు, అది గుడ్డు పెట్టే కోడి జాతి (Genetics) మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తెల్లటి ఈకలు ఉండే కోళ్లు తెల్ల గుడ్లను పెడతాయి. గోధుమ లేదా ఎరుపు రంగు ఈకలు ఉండే కోళ్లు బ్రౌన్ గుడ్లను పెడతాయి. కాబట్టి రంగుకు, ఆరోగ్యానికి ఎలాంటి సంబంధం లేదు.

పోషకాలలో ఏది బెస్ట్? పోషకాల (Nutrients) విషయానికి వస్తే, వైట్ ఎగ్ మరియు బ్రౌన్ ఎగ్ మధ్య ఎలాంటి తేడా లేదు.

ఈ రెండింటిలోనూ ఒకే రకమైన ప్రోటీన్లు, విటమిన్లు (విటమిన్ A, D, B12), మినరల్స్, మరియు ఫ్యాట్ ఉంటాయి.

ఒక మీడియం సైజు గుడ్డు (అది తెల్లదైనా, బ్రౌన్ దైనా) సుమారు 70 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్ ఇస్తుంది.

కాబట్టి, బ్రౌన్ గుడ్డు తింటే ఎక్కువ బలం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే.

మరి బ్రౌన్ గుడ్లకు ఎందుకు అంత ధర? పోషకాలు సమానమైనప్పుడు బ్రౌన్ ఎగ్స్ ఎందుకు అంత ఖరీదుగా ఉంటాయి అనే సందేహం రావడం సహజం. దీనికి ప్రధాన కారణం.. బ్రౌన్ గుడ్లను పెట్టే కోళ్లు, తెల్ల కోళ్ల కంటే సైజులో పెద్దగా ఉంటాయి. ఇవి పెరగడానికి ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఎక్కువ మేత (Feed) తింటాయి. కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చు పెరగడం వల్లే, బ్రౌన్ గుడ్ల ధర కూడా ఎక్కువగా ఉంటుంది.

కోడి తినే మేతను బట్టి మారుతుందా? అవును. గుడ్డులో ఉండే పోషకాలు రంగుపై కాకుండా, ఆ కోడికి పెట్టే ఆహారం (Feed) పై ఆధారపడి ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లేదా విటమిన్-డి ఉన్న ఆహారాన్ని కోళ్లకు పెడితే, అవి పెట్టే గుడ్లలో ఆ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తెల్ల గుడ్లు అయినా సరే, సాధారణ బ్రౌన్ గుడ్ల కంటే ఎక్కువ మేలు చేస్తాయి.

ఫైనల్‌గా ఏది తినాలి? మీరు తెల్ల గుడ్డు తిన్నా, బ్రౌన్ గుడ్డు తిన్నా మీ శరీరానికి అందే పోషకాలు ఒకటే. కాబట్టి, మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుందో దానిని ఎంచుకోండి. అయితే, రంగు కంటే కూడా గుడ్డు ఎంత ఫ్రెష్‌గా ఉందనేది ముఖ్యం. లోకల్ ఫామ్స్ నుంచి లేదా ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన కోళ్ల గుడ్లను ఎంచుకోవడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.
Also Read: మెలనిన్ ఉత్పత్తిని పెంచి నేచురల్ గా తెల్ల జుట్టుకు చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్.. గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top