జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? గూగుల్ ఫొటోలను వేరే అకౌంట్‌కు సులభంగా మార్చుకోండిలా!

gmail full storage
జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అవ్వటం అనేది ప్రతి ఒక్కరికి ఎదో ఒక సమయంలో జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఏమి చేయాలో అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

గూగుల్ ప్రతి యూజర్‌కు 15 GB ఉచిత స్టోరేజ్ మాత్రమే అందిస్తుంది. జీమెయిల్ (Gmail), గూగుల్ డ్రైవ్ (Google Drive), గూగుల్ ఫొటోలు (Google Photos) అన్నీ కలిపి ఈ 15GB లోనే ఉంటాయి. 

ఫొటోలు, వీడియోల వల్ల ఈ స్టోరేజ్ చాలా త్వరగా నిండిపోతుంది. "Storage Full" అని మెసేజ్ రాగానే, కొత్త మెయిల్స్ రావడం కూడా ఆగిపోతాయి.
ఇలాంటి సమయంలో స్టోరేజ్ కొనుగోలు చేయడం ఇష్టం లేకపోతే, పాత అకౌంట్ నుండి ఫొటోలను కొత్త జీమెయిల్ అకౌంట్‌కు మార్చుకోవడం (Google Photos Transfer) ఉత్తమమైన మార్గం. దీనికోసం ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

విధానం 1: 'పార్ట్‌నర్ షేరింగ్' (Partner Sharing) ద్వారా (అతి సులభమైన పద్ధతి)

గూగుల్ ఫొటోలను వేరే అకౌంట్‌కు మార్చడానికి ఇది అత్యంత సులభమైన మరియు వేగవంతమైన పద్ధతి. దీని కోసం ఎంబీలు, జీబీలు ఖర్చు చేసి ఫొటోలను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

పాత అకౌంట్‌లో లాగిన్ అవ్వండి: ముందుగా స్టోరేజ్ ఫుల్ అయిన పాత అకౌంట్‌తో మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో గూగుల్ ఫొటోస్ (Google Photos) యాప్ ఓపెన్ చేయండి.

పార్ట్‌నర్ షేరింగ్ సెట్టింగ్స్: పైన ఉన్న ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి, Photos settings > Sharing > Partner sharing ఆప్షన్ ఎంచుకోండి.

కొత్త మెయిల్ ఐడీ ఇవ్వండి: అక్కడ మీ కొత్త జీమెయిల్ అకౌంట్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
అన్నీ షేర్ చేయండి: "All photos" ఆప్షన్‌ను ఎంచుకుని ఇన్విటేషన్ పంపండి (Send Invitation).

కొత్త అకౌంట్‌లో యాక్సెప్ట్ చేయండి: ఇప్పుడు మీ కొత్త జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఆ ఇన్విటేషన్‌ను యాక్సెప్ట్ (Accept) చేయండి.

ఆటో సేవ్ (Auto-Save) ఆన్ చేయండి (చాలా ముఖ్యం): కొత్త అకౌంట్‌లో పార్ట్‌నర్ షేరింగ్ సెట్టింగ్స్‌కి వెళ్లి, "Save to your account" అనే ఆప్షన్‌ను ఎంచుకుని "All photos" అని సెట్ చేయండి.

దీనివల్ల పాత అకౌంట్‌లోని ఫొటోలన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో కొత్త అకౌంట్‌కి సేవ్ అయిపోతాయి. అన్నీ సేవ్ అయినట్లు నిర్ధారించుకున్న తర్వాత, పాత అకౌంట్ నుండి ఫొటోలను డిలీట్ చేస్తే మీ 15GB స్టోరేజ్ మళ్లీ ఖాళీ అవుతుంది.
విధానం 2: గూగుల్ టేక్అవుట్ (Google Takeout) ఉపయోగించి
మీరు అన్ని ఫొటోలను మీ కంప్యూటర్ లేదా హార్డ్ డిస్క్‌లో కూడా దాచుకోవాలి అనుకుంటే ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

బ్రౌజర్‌లో
takeout.google.com వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

'Deselect all' పై క్లిక్ చేసి, కిందికి స్క్రోల్ చేసి కేవలం Google Photos ని మాత్రమే సెలెక్ట్ చేయండి.

కిందికి వెళ్లి Next step పై క్లిక్ చేయండి.

ఫైల్ సైజు (ఉదాహరణకు 2GB లేదా 10GB) ఎంచుకుని, Create export బటన్ నొక్కండి.

మీ ఫొటోల సైజును బట్టి కొంత సమయం (కొన్ని గంటలు లేదా రోజులు) తర్వాత మీ జిమెయిల్‌కు డౌన్‌లోడ్ లింక్ వస్తుంది.

ఆ జిప్ (Zip) ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, వాటిని మీ కొత్త జీమెయిల్ అకౌంట్‌లోని గూగుల్ ఫొటోస్‌లో మాన్యువల్‌గా అప్‌లోడ్ చేసుకోండి.
గమనిక:
పార్ట్‌నర్ షేరింగ్ పద్ధతి ద్వారా మార్చుకునేటప్పుడు, కొత్త అకౌంట్‌లో "ఆటో సేవ్" (Auto-save) ఆన్ చేసిన తర్వాత.. ఫొటోలన్నీ సేవ్ అవ్వడానికి మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొంత సమయం పడుతుంది. అన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకున్నాకే పాత అకౌంట్‌లో డిలీట్ చేయండి.

పాత అకౌంట్‌లో డిలీట్ చేసిన ఫొటోలు "Trash" లేదా "Bin" లోకి వెళ్తాయి. అక్కడ కూడా డిలీట్ (Empty Bin) చేస్తేనే మీ స్టోరేజ్ పూర్తిగా ఖాళీ అవుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top