చింత గింజలను చెత్తబుట్టలో వేస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఒక్క గింజ కూడా పారేయరు!

Chinta ginjalu benefits
మనం ప్రతిరోజూ వంటల్లో చింతపండును వాడుతూనే ఉంటాం. పులుపు కోసం దాన్ని వాడేసి, అందులోని గింజలను మాత్రం పనికిరావని చెత్తలో పారేస్తుంటాం. అయితే, ఆ చింతగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 

కీళ్ల నొప్పుల నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో సమస్యలకు ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
చింత గింజలతో కలిగే అద్భుత లాభాలు:
కీళ్ల నొప్పులకు చెక్: కొన్ని చింతగింజల్ని వేయించి పొడి చేసుకుని, రోజూ రెండు పూటలా ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే కీళ్ల నొప్పులు ఇట్టే తగ్గుతాయి. ఆర్థరైటిస్ సమస్యల నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది.
గుండెకు రక్ష: చింతగింజల్లో పొటాషియంతో పాటు అన్-శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుని, గుండెను పదిలంగా ఉంచుతాయి.

జీర్ణక్రియ - డయేరియా నివారణ: చింతగింజల జ్యూస్‌ తీసుకుంటే అజీర్ణ సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా ఈ గింజల పైన ఉండే ఎర్రటి పొరలో 'జిలోగ్లూక్యాన్' అనే పదార్థం ఉంటుంది, ఇది డయేరియాను సమర్థవంతంగా అరికడుతుంది.
దంతాలు, గొంతు సమస్యలు దూరం: వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా చింతగింజల పొడిని కలిపి మౌత్ వాష్‌లా పుక్కిలిస్తే.. నోటి దుర్వాసన, గొంతు నొప్పి, జలుబు, దంత సమస్యలు మాయం అవుతాయి.

డయాబెటిస్ కంట్రోల్: షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ గింజల చూర్ణం అద్భుతంగా పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి?
మంచి ఫలితాల కోసం చింత గింజలను సరైన పద్ధతిలో వాడాలి. ఆ విధానం ఇదే..

ముందుగా పుచ్చులు లేని మంచి చింత గింజలను తీసుకుని పెనంపై బాగా వేయించాలి.

వేయించిన గింజలను రెండు రోజుల పాటు మంచి నీటిలో నానబెట్టాలి. (ఉదయం, సాయంత్రం నీటిని మారుస్తూ ఉండాలి).

బాగా నానిన తర్వాత వాటిపై ఉండే పొట్టును తీసేసి, ఎండబెట్టి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
రోజూ రెండుసార్లు అర టీస్పూన్ ఈ చూర్ణాన్ని పాలు లేదా నీటిలో కలుపుకుని (కొద్దిగా నెయ్యి లేదా చక్కెర జతచేసి) తీసుకోవచ్చు.

గమనిక: క్రమం తప్పకుండా ఈ చింతగింజల చూర్ణాన్ని తీసుకుంటే నెల రోజుల్లోపే మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇకపై వంటల్లో వచ్చే చింతగింజలను అస్సలు పారేయకండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top