ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య 'హై కొలెస్ట్రాల్'. వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి కూర్చోవడం, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు విపరీతంగా పేరుకుపోతోంది.
దీనివల్ల గుండెపోటు ముప్పు పెరుగుతోంది. అయితే, ఇంట్లో ఉండే ఒకే ఒక్క చిన్న వస్తువుతో ఈ చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) మొత్తాన్ని ఇట్టే కరిగించేయవచ్చు. అదేంటో తెలుసా? ఉల్లిపాయ!
ఉల్లిపాయతో చేసే 'టీ' తాగితే రక్తనాళాల్లో ఉన్న బ్లాకేజ్ లు పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల కలిగే అద్భుతమైన లాభాలు, ఆ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఉల్లిపాయ టీ తో అద్భుత ప్రయోజనాలు ఇవే..
గుండెకు శ్రీరామరక్ష: ఉల్లిపాయ టీలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.
రక్తనాళాల క్లీనింగ్: ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (LDL) ను పూర్తిగా కరిగించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరిగేలా చేస్తుంది.
బీపీ కంట్రోల్: హై బీపీని అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా (Blood Clots) నిరోధిస్తుంది.
ఈ మ్యాజిక్ టీ ఎలా తయారు చేయాలంటే?
ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో ఒక గ్లాసు నీళ్లు పోయాలి.
ఆ నీటిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక యాలక్కాయ, రెండు మిరియాలు, అర స్పూన్ సోంపు గింజలు వేయాలి.
వీటన్నింటిని సన్నని మంట మీద 7 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
నీరు సగం అయ్యాక, స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకోవాలి.
ఈ టీ కొద్దిగా చల్లారి గోరువెచ్చగా అయ్యాక.. అందులో కొద్దిగా తేనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి.
ఎలా తాగాలి? ఈ ఉల్లిపాయ టీని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. రోజుకి అర గ్లాసు చొప్పున ఈ డ్రింక్ తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం మీరే గమనిస్తారు!
(గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ లో దొరికిన వివరాల ఆధారంగా ఇవ్వబడింది. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, రెగ్యులర్ గా మందులు వాడుతున్నా.. డాక్టర్ సలహా తీసుకున్నాకే దీనిని పాటించడం మంచిది.)
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

