మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటిలో ప్రధానమైనది 'డయాబెటిస్' (మధుమేహం).
ఒక్కసారి షుగర్ వ్యాధి బారిన పడితే జీవితకాలం మందులు వాడక తప్పదు. అయితే, సరైన ఆహారం తీసుకుంటే మందులతో పనే లేకుండా డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
డయాబెటిస్‌ను నియంత్రించడంలో 'పిస్తా పప్పు' (Pistachios) అద్భుతంగా సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకున్నారు.
అయితే, చాలామంది డ్రై ఫ్రూట్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు. కానీ, పిస్తా పప్పులను నీళ్లలో కాకుండా, పాలలో ఉడికించి తీసుకుంటే మన శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి.
ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి, అందులో ఒక గ్లాసు పాలు పోయాలి.
పాలు కాస్త వేడెక్కాక, కేవలం ఐదు పిస్తా పప్పులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాలలో వేయాలి.
ఒక ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద పాలను బాగా మరగనివ్వాలి.
పాలు గోరువెచ్చగా అయ్యాక, అందులోని పిస్తా ముక్కలను నములుతూ ఆ పాలను తాగాలి.
ఈ పాలు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:
షుగర్ కంట్రోల్ (Diabetes Control): డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ ఈ పాలను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది షుగర్ పేషెంట్లకు ఒక బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు.
దృఢమైన ఎముకలు: పాలు, పిస్తా పప్పు.. ఈ రెండింటిలోనూ కాల్షియం (Calcium) పుష్కలంగా ఉంటుంది. ఈ పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది.
కండరాల బలం: శరీరానికి అవసరమైన హై-క్వాలిటీ ప్రోటీన్ ఈ పానీయం ద్వారా అందుతుంది. ఇది కండరాలను బలోపేతం చేసి నీరసాన్ని తగ్గిస్తుంది.
కంటిచూపు మెరుగు: ఈ రోజుల్లో మొబైల్, సిస్టమ్ వాడకం విపరీతంగా పెరిగిపోయి చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పిస్తా పాలను రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకుంటే కంటి చూపు (Eye sight) మెరుగుపడుతుంది.
గమనిక: ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

