మన ఇంటి చుట్టుపక్కల, పంట పొలాల్లో ఎన్నో రకాల మొక్కలు కనిపిస్తుంటాయి. వాటిలో ఏముందిలే అని కలుపు మొక్కల్లా భావించి పీకి పారేస్తుంటాం.
కానీ, పల్లెటూళ్లలో ఉండే వారికి తెలుసు ఆయా మొక్కల్లో దాగి ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు ఏమిటో! అలాంటి కోవకే చెందుతుంది 'ముళ్ళ తోటకూర'.
సాధారణంగా వరి పొలాల గట్ల మీద ఎక్కువగా కనిపించే ఈ ఆకుకూర కొమ్మల చివర చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. అందుకే దీనిని 'ముళ్ళ తోటకూర' (Spiny Amaranth) అని పిలుస్తారు.
ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో లభించే ఈ మొక్కలో మనకు తెలియని ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం:
1. కిడ్నీలో రాళ్లకు (Kidney Stones) దివ్యౌషధం: మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ముళ్ళ తోటకూర అద్భుతంగా పనిచేస్తుంది.
ముందుగా ఈ చెట్టు వేర్లను సేకరించి, శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి.
ఈ వేరును అవసరమైనప్పుడు సాన రాయి మీద కొద్దిగా నీళ్లు పోసి అరగదీయాలి.
అలా వచ్చిన గంధాన్ని (పేస్ట్) అర స్పూన్ మోతాదులో తీసుకుని, ఒక గ్లాస్ నీటిలో కలుపుకోవాలి.
ప్రతిరోజూ భోజనానికి అరగంట ముందు ఈ నీటిని తాగితే.. కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్లు సులభంగా కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి.
2. గాయాలకు తక్షణ మందు: పొలాల్లో పనిచేసేటప్పుడు లేదా ఇంట్లో ఏదైనా చిన్నపాటి గాయాలు అయినప్పుడు వెంటనే బ్లీడింగ్ అవుతుంటుంది.
అటువంటి సమయంలో ఈ ముళ్ళ తోటకూర ఆకులను మెత్తని పేస్ట్‌లా నూరి, ఆ గాయం మీద రాయాలి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం వెంటనే ఆగిపోవడమే కాకుండా, గాయం కూడా త్వరగా మానుతుంది.
3. చర్మ సమస్యలు, దద్దుర్లు (Skin Rashes): చర్మంపై అకస్మాత్తుగా వచ్చే దద్దుర్లు, దురదలకు కూడా ఈ ఆకులు బాగా పనిచేస్తాయి. ముళ్ళ తోటకూర ఆకుల పేస్ట్‌ను దద్దుర్లు ఉన్న చోట రాస్తే చాలా తొందరగా ఉపశమనం లభిస్తుంది.
ముఖ్య గమనిక: ముళ్ళ తోటకూర వేరుతో కిడ్నీలో ఉండే చిన్నపాటి రాళ్లు మాత్రమే కరుగుతాయి. రాళ్లు పెద్దవిగా ఉండి, నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ చిట్కాలపైనే ఆధారపడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే, ఏ ఆయుర్వేద లేదా గృహ వైద్యాన్ని పాటించే ముందైనా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

