ఉదయాన్నే పరగడుపున 4 తులసి ఆకులు నమిలితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..!

Tulasi leaves
తులసి చెట్టు పవిత్రత గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి ఇంటా పూజలందుకునే తులసి.. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగానూ ఒక 'సంజీవని' లాంటిది. 

కానీ, రోజూ ఉదయాన్నే పరగడుపున కేవలం 4 తులసి ఆకులను నమిలి మింగడం వల్ల మీ శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

తులసి ఆకుల్లో విటమిన్ A, C, K లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మరి ఈ ఆకులను రోజూ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

1. రోగనిరోధక శక్తికి బ్రహ్మాస్త్రం తులసిలో ఉండే విటమిన్ సి, జింక్ శరీరంలో ఇమ్యూనిటీని అమాంతం పెంచుతాయి. 
ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మిమ్మల్ని సీజనల్ వ్యాధుల నుంచి కాపాడతాయి. ముఖ్యంగా తులసి ఆకుల రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు ఇట్టే మాయమవుతాయి.

2. ఒత్తిడి మాయం.. మెదడు కూల్ ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది సర్వసాధారణం అయిపోయింది. తులసిలో ఉండే విటమిన్ ఎ, బి.. మెదడులోని సెరటోనిన్, డోపమైన్ హార్మోన్లను బ్యాలెన్స్ చేసి మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తాయి.
3. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్.. గుండెకు రక్ష శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తపోటు (BP)ని నియంత్రణలో ఉంచి, భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.

4. డయాబెటిస్ రోగులకు వరం మధుమేహంతో బాధపడేవారు రోజూ తులసి ఆకులను నమలడం అలవాటు చేసుకోవాలి. దీని రసం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా తగ్గిస్తుంది. తద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
5. అజీర్తి దూరం.. ఆకలి పెంపు కడుపులో గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తులసి ఇట్టే తగ్గిస్తుంది. ఆకలి మందగించిన వారికి ఆకలి పుట్టిస్తుంది. 

అంతేకాదు, కడుపులోని నులిపురుగులను నాశనం చేయడంతో పాటు ఆస్తమా, కఫం, కోరింత దగ్గు నుంచి తక్షణ ఉపశమనం ఇస్తుంది.
ఎలా తీసుకోవాలి?
ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే పరగడుపున 4 నుంచి 5 తులసి ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగాలి.

ఉదయం పూట తినడం కుదరని వారు, రోజులో ఏ సమయంలోనైనా వీటిని తీసుకోవచ్చు.

గమనిక: ఇంకెందుకు ఆలస్యం, నేటి నుంచే ఈ చిన్న అలవాటును ప్రారంభించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి! మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ ఉపయోగకరమైన సమాచారాన్ని షేర్ చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top