మన వంటగదిలోని పోపుల పెట్టెలో తప్పనిసరిగా ఉండే దినుసు ఆవాలు. తాలింపులో ఆవాలు పడితే ఆ కూర రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి. అయితే, తినేటప్పుడు కూరలో ఆవాలు తగిలితే చాలామంది విసుక్కుని ఏరి పక్కన పెట్టేస్తుంటారు.
కానీ, ఆ చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు తెలిస్తే.. ఇకపై మీరెప్పుడూ వాటిని వదిలిపెట్టరు. అవేంటో తెలుసుకుందాం..
1. పంటి నొప్పికి తక్షణ ఉపశమనం పంటి నొప్పితో బాధపడేవారికి ఆవాలు ఒక మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. గోరువెచ్చని నీటిలో కొన్ని ఆవాలు వేసి, ఆ నీటిని వడకట్టి పుక్కిలిస్తే (గార్గిల్ చేస్తే) పంటి నొప్పి ఇట్టే మాయమవుతుంది.
2. కీళ్ల నొప్పులకు దివ్యౌషధం వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న కీళ్ల నొప్పులకు ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆవాలను ముద్దగా నూరి, అందులో కొద్దిగా కర్పూరం కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, ఏవైనా గాయాలు అయినప్పుడు ఆవపొడి రాస్తే త్వరగా మానుతాయి.
3. శ్వాసకోశ సమస్యలు దూరం సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడేవారు ఒక స్పూన్ ఆవపొడిలో కొద్దిగా తేనె కలుపుకుని తీసుకుంటే జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
4. చర్మంపై పులిపిర్లు రాలిపోతాయి! ముఖం లేదా శరీరంపై ఏర్పడే పులిపిర్లను తొలగించడానికి ఆవాల పొడి బెస్ట్ హోమ్ రెమెడీ. ఆవ పొడిని కొద్దిగా నీటితో మెత్తని పేస్ట్‌లా చేసి పులిపిర్లపై రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అవి ఎండిపోయి వాటంతట అవే రాలిపోతాయి.
5. జుట్టు రాలడం, చుండ్రుకు చెక్ ఆవనూనెను తలకు పట్టిస్తే జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు పూర్తిగా పోతాయి. అలాగే ఆవాల పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకుని, గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మృదువుగా మారుతుంది.
6. రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగు ఆవాల్లో ఉండే 'సెలీనియం' శరీరంలో ఇమ్యూనిటీని అమాంతం పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. కూరల తాలింపులో వాడటం వల్ల ఆకలి పెరిగి, తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
గమనిక: చూశారుగా.. ఆవాలతో ఎన్ని అద్భుత లాభాలు ఉన్నాయో! ఇంకెందుకు ఆలస్యం, ఆవాలను ఏరి పారెయ్యకుండా ఆహారంలో భాగం చేసుకోండి.

