మన భారతీయ వంటకాల్లో పోపు పెట్టాలన్నా, పచ్చళ్లు చేయాలన్నా ఆవాలు ఉండాల్సిందే. సాధారణంగా మనం నల్ల ఆవాలనే ఎక్కువగా వాడుతుంటాం. కానీ, మార్కెట్లో లభించే తెల్ల ఆవాలు (White Mustard Seeds) శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఇందులో ఉండే అద్భుతమైన పోషకాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన మందులా పనిచేస్తాయి. మరి తెల్ల ఆవాలు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
తెల్ల ఆవాలలో విటమిన్ ఎ, బి-కాంప్లెక్స్ (బి1, బి2, బి3, బి5, బి6, బి9), విటమిన్ సి, ఇ, కె లతో పాటు జీంక్, కాల్షియం, పొటాషియం, సోడియం మరియు బీటా కెరోటిన్ వంటి పోషకాలు విపరీతంగా ఉన్నాయి. ఇందులో ఉండే 'డైటరీ ఫాట్స్' శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి.
1. జీర్ణక్రియ 8 రెట్లు పెరుగుతుంది!
తెల్ల ఆవాలు తింటే శరీరంలో లాలాజలం (Saliva) ఉత్పత్తి 8 రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. లాలాజలం ఎంత బాగా ఊరితే.. ఆహారం అంత త్వరగా జీర్ణమవుతుంది. ఇది మెటబాలిజాన్ని పెంచి, గ్యాస్, అసిడిటీ సమస్యలు లేకుండా చేస్తుంది.
ఇందులో పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తాయి. తరచూ వచ్చే కండరాల తిమ్మిర్లు (Muscle Cramps), నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.
3. బీపీ కంట్రోల్.. ఇమ్యూనిటీ బూస్ట్!
తెల్ల ఆవాలలో మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం మరియు సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రక్తపోటును (Blood Pressure) సమతుల్యంగా ఉంచడమే కాకుండా, బాడీలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.
4. గొంతు నొప్పి, కఫం నుండి ఉపశమనం
ఈ ఆవాలు గొంతు మరియు ఊపిరితిత్తుల నుండి పేరుకుపోయిన కఫాన్ని (శ్లేష్మం) బయటకు పంపడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల వచ్చే దగ్గు, గొంతు నొప్పి, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలను ఇవి త్వరగా తగ్గిస్తాయి.
చేపల కూరలు, నాన్-వెజ్ వంటకాల్లో ఈ తెల్ల ఆవాల పొడిని వేసుకుంటే కూర అద్భుతమైన రుచితో పాటు సువాసన వస్తుంది.
సలాడ్స్, వేడి వేడి సూప్స్ పైన ఈ ఆవాల పొడిని లైట్‌గా చల్లుకుని తీసుకోవచ్చు.
నొప్పుల నివారణకు: తెల్ల ఆవాల నూనెను గోరువెచ్చగా చేసి నొప్పులు, వాపులు ఉన్న చోట మసాజ్ చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
అదనపు ప్రయోజనం: ఈ ఆవాలను క్రమంగా తీసుకోవడం వల్ల మెదడు కణాలు చురుగ్గా మారి, జ్ఞాపకశక్తి (Memory Power) కూడా పెరుగుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

