Cumin Seeds



జీలకర్ర :
జీర్ణసంబంధ సమస్యలను తగ్గించడంలో జీలకర్ర ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరమైనది కూడా. ఎన్నో రుగ్మతల బారి నుంచి ఇది కాపాడుతుంది. జీలకర్ర డికాషన్‌ను తరుచుగా తీసుకుంటే జలుబు, జ్వరం దరిచేరదు. జీలకర్రను నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది.

 జీర్ణసంబంధ సమస్యలకు   :
అజీర్ణం, డయేరియా, మాల్అబ్జార్‌ప్షన్ సిండ్రోమ్, మార్నింగ్ సిక్‌నెస్, ఇతర పైత్య సంబంధ సమస్యలకు, జీర్ణసమస్యలకు జీలకర్ర మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో టీ స్పూన్ జీలకర్ర వేసి మరిగించి, దానికి కొత్తిమీరతో చేసిన జ్యూస్, కొంచెం ఉప్పు కలుపుకుని ప్రతిరోజు రెండు పూటలా భోజనం తరువాత తీసుకుంటే డయేరియా ఇట్టే తగ్గిపోతుంది.


పైల్స్     :
అరవైగ్రాముల జీలకర్రను మెత్తగా పొడి చేసుకుని ప్రతిరోజు మూడుగ్రాముల పొడిని నీళ్లతో పాటు తీసుకుంటే పైల్స్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.


ఇన్సోమ్నియా, అమ్నీసియా    :
నిద్రలేమికి జీలకర్ర మంచి ఔషధం. ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్రను, అరటి పండు ముక్కలతో కలిపి తీసుకుంటే నిద్ర ముంచుకు వస్తుంది. అమ్నీసియాకు, జ్ఞాపకశక్తి సన్నగల్లినవారికి జీలకర్ర మంచి ఉపయోగం. మూడు గ్రాముల నల్ల జీలకర్రను పన్నెండు గ్రాముల తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 సాధారణ జలుబుకు     :
జీలకర్ర వేసి మరిగించిన నీరు తాగితే సాధారణ జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకగ్లాసు నీటిని తీసుకుని అందులో టీ స్పూన్ జీలకర్ర వేసి మరిగించుకోవాలి. ఆ నీటిని వడపోసి చల్లార్చి తాగాలి. ఈ డికాషన్ జలబుకు బాగా పనిచేస్తుంది. జలుబుతో పాటు గొంతులో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే అదే నీటిలో కొన్ని అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. గొంతులో గరగరను సైతం ఇది తొలగిస్తుంది.


గర్భిణిలకు    :
జీలకర్రతో చేసిన డికాషన్‌ను పాలు, తేనెతో కలిపి రోజుకొకసారి ప్రెగ్నెసీ సమయంలో తీసుకుంటే బిడ్డ ఎదుగుదల చక్కగా ఉంటుంది. డెలివరీ కూడా సులభంగా అవుతుంది. చనుబాలు సమృద్ధిగాపడతాయి.


మూత్రసంబంధ వ్యాధులకు    :
20గ్రా. జీలకర్ర, 12గ్రా. ఓమ, 6గ్రా ఉప్పు, కొంచెం వెనిగర్ వేసి మెత్తగా చేసుకుని ప్రతి గంటకొకసారి మూడుగ్రాముల చొప్పున తీసుకుంటే మూత్రసంబంధ వ్యా«ధులు తగ్గిపోతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top