జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని బాధపడుతున్నారా? అయితే కాఫీ తాగండి.


కాఫీలు, టీలు కడుపు నింపుతాయా, ఆరోగ్యాన్నిస్తాయా? అని సణిగే రోజులకు కాలం చెల్లింది. భోజనాన్ని తగ్గించి ఫర్వాలేదు..కాని, రోజుకోసారైనా కాఫీ తాగండి...ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని బాధపడుతున్నారా? అయితే కాఫీ తాగండి. నడుం కొలత పెరిగిపోతోందని దిగులు పడుతున్నారా? కాఫీ తాగితే మీ బాధ బలాదూర్! ఈ వాస్తవాలన్నీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడయ్యాయి. రాత్రి పూట భోజనం మితంగా తీసుకుని ఒక కప్పు కాఫీ తాగితే జ్ఞాపక శక్తి పెరగడంతోపాటు నడుం కూడా సన్న బడుతుందట.

మెదడు చురుగ్గా పనిచేయాలంటే అప్పుడప్పుడు కడుపును మాడ్చుకుంటే మంచిదని కూడా డాక్టర్లు చెబుతున్నారు. ఇలా ఉపవాసం ఉండడం వల్ల ఒంట్లోని క్యాలరీలు ఖర్చయి ఆరోగ్యవంతంగా ఉండడంతోపాటు ఆయుర్దాయం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. క్యాలరీలు బాగా ఖర్చయితే జ్ఞాపకశక్తికి, పరిజ్ఞాన శక్తికి అవసరమైన మెదడులోని సిఆర్ ఇబిఐ అనే ప్రొటీన్ బాగా ఉత్పత్తి అవుతుందని వైద్య పరిశోధనలో తేలింది. ఇలా చేయడం వల్ల రోజుకు సుమారు 600 క్యాలరీలు ఖర్చవుతాయట. అందువల్ల కాఫీలు తాగితే ఆరోగ్యం చెడిపోతుందన్న అపోహలు విడనాడి మితాహారం+కప్పు కాఫీతో మీ రాత్రి మెనూ సిద్ధం చేసుకోండి.
Share on Google Plus