గోళ్లు కట్ చేస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి.

తల్లిదండ్రులు చాలా చిన్న విషయంగా పరిగణించే అతిపెద్ద విషయం ఒకటుంది అంటున్నారు పిల్లల వైద్య నిపుణులు. అదేంటంటే పిల్లల గోళ్ల సంరక్షణ. గోళ్లు పెరిగి, అందులో మురికి చేరితే ఆహారం తీసుకునేటప్పుడో, పిల్లలు వేళ్లను నోట్లో పెట్టుకునేటప్పుడో ఆ మురికి వారి కడుపులోకి చేరుతుంది. అది పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తుంది. అంతేకాదు పెరిగిన గోళ్లను కత్తిరించడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా ప్రమాదమే అంటూ వైద్యులు తగు సూచనలు చేస్తున్నారు. 

  • పిల్లలు చేతులు ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి.
  • నెయిల్ క్లిప్పర్స్ చివరలు ఎగుడుదిగుడులు లేనివి ఎంచుకోవాలి.
  • సురక్షితమైన నెయిల్ క్లిప్సర్స్‌ను మాత్రమే వాడాలి. కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకూడదు.
  • చిగుళ్లకు తాకేలా గోళ్లను కత్తిరించకూడదు.
  • టీవీలో పిల్లలకు నచ్చిన కార్యక్రమం చూపిస్తూనో, కథలు చెప్పుతూనో గోళ్లను కత్తిరించడాన్ని ముగించవచ్చు.
  • దోగాడే వయసు పిల్లలకు వారు పడుకునేటప్పుడు గోళ్లను కత్తిరించడం మేలు.
  • స్నానం చేయించిన తర్వాత గోళ్లు మెత్తబడతాయి. అప్పుడు గోళ్లను కత్తిరించడం కూడా సులువు.
  • గోళ్లను కత్తిరించే ముందు పౌడర్ అద్దితే పెరిగినవి ఎక్కడి వరకు ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తాయి. కత్తిరించడం కూడా సులువు అవుతుంది.
Share on Google Plus